E-Paper
Advertisement

టెక్టన్ కోసం హృతిక్ రోషన్.. నిస్సాన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

టెక్టన్ కోసం హృతిక్ రోషన్.. నిస్సాన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Hrithik Roshan Joins Nissan India: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నిస్సాన్ ఇండియా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ గా ఎంపికయ్యారు. అంతేకాదు, కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టెక్టన్ మిడ్ సైజ్ SUVని కూడా ఆయన ఆధ్వర్యంలోనే భారత మార్కెట్‌ లోకి విడుదల చేసింది. కొత్త కారు, స్టార్ హీరో కలయికతో నిస్సాన్ ఇండియన్ మార్కెట్‌ లో మరింత బలంగా సత్తా చాటాలని భావిస్తోంది.

యూత్ లో క్రేజ్ సంపాదించుకునేలా..

హృతిక్ రోషన్‌ ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవడం ద్వారా యువతతో పాటు ప్రీమియం కార్ల కొనుగోలుదారులను కూడా ఆకర్షించాలని నిస్సాన్ భావిస్తోంది. కొత్త బ్రాండ్ ఇమేజ్‌ తో మార్కె ట్‌లో తన గుర్తింపును మరింత పెంచుకోవాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే హృతిక్ తో టెక్టన్ ప్రచారం మొదలు పెట్టింది.

మార్కెట్ లోకి కొత్త టెక్టన్ SUV

Advertisement

కొత్త టెక్టన్ SUV తాజాగా మార్కెట్ లోకి విడుదల అయ్యింది. రూ.10.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్) నుంచి ధర ప్రారంభమవుతుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ లాంటి పాపులర్ SUVలకు టెక్టన్ గట్టి పోటీ ఇస్తుందని  కంపెనీ భావిస్తోంది. డిజైన్ పరంగా టెక్టన్ బాగా ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, C-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్స్, బలమైన బోనెట్ మరింత స్టైలిష్‌ గా కనిపించేలా చేస్తున్నారు. బోనెట్‌పై కనిపించే  TECTON బ్యాడ్జింగ్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది.

సైడ్ ప్రొఫైల్‌ లో పెద్ద వీల్ ఆర్చ్‌ లు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, స్టైలిష్ డోర్ హ్యాండిల్స్  కనిపిస్తున్నాయి.  వెనుక భాగంలో ప్రత్యేక డిజైన్‌తో టెయిల్ ల్యాంప్స్, బలమైన బంపర్ SUVకి మరింత ప్రీమియం లుక్‌ ను ఇస్తున్నాయి. మొత్తం 11 కలర్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. వీటిలో మోనోటోన్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక క్యాబిన్‌లోకి అడుగుపెడితే అత్యాధునిక ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి ప్రీమియం ఫీచర్లను అందించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ బిల్ట్-ఇన్ సేవలు, స్మార్ట్ కనెక్టివిటీ లాంటిటెక్నాలజీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ గురించి..

Advertisement

టెక్టన్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 హెచ్‌పీ పవర్, 166Nm టార్క్‌ ను అందిస్తుంది. మరోవైపు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 హెచ్‌పీ పవర్, 280Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్‌తో పాటు 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ పరంగా చిన్న ఇంజిన్ 19.4 kmpl వరకు, పెద్ద ఇంజిన్ 18.5 kmpl వరకు ఇస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లు, పవర్ ఫుల్ టర్బో ఇంజిన్లతో పాటు  ఇప్పుడు హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరడం.. నిస్సాన్ టెక్టన్‌ కు కలిసి వచ్చే అవకాశం ఉంది.

Read Also: నిస్సాన్ టెక్టన్ వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో అన్ని క్రేజీ ఫీచర్లా?

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×