E-Paper
Advertisement

డిజిటల్ యుగంలో పాత ఫ్యాషన్ క్వీన్ కష్టాలు… ఓటీటీలోకి అడుగు పెట్టిన క్లాసిక్ హిట్‌ సీక్వెల్‌

డిజిటల్ యుగంలో పాత ఫ్యాషన్ క్వీన్ కష్టాలు… ఓటీటీలోకి అడుగు పెట్టిన క్లాసిక్ హిట్‌ సీక్వెల్‌
Advertisement

The Devil Wears Prada 2: కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు హిట్ అవుతాయి… మరికొన్ని కాలంతో పాటు మరింత విలువ పెంచుకుంటాయి. 2006లో వచ్చిన ‘ది డెవిల్ వేర్స్ ప్రద’ అలాంటి సినిమానే. ఫ్యాషన్ ప్రపంచం వెనుక ఉండే ఒత్తిడి, పవర్, పోటీ, మనుషుల మధ్య సంబంధాలను అద్భుతంగా చూపించిన ఈ సినిమా ఇప్పటికీ హాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కథకు కొనసాగింపుగా The Devil Wears Prada 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత పాత్రలు మళ్లీ కనిపించడంతో పాటు… ఈసారి కథ పూర్తిగా మారిన ప్రపంచంలో సాగడం మరో ఆసక్తికరమైన విషయం. మరి ఈసారి మిరాండా ప్రీస్లీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది ? పాత టీమ్ మళ్లీ ఎలా ఒక్కటైంది ? ఇంతకీ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని మ్యాగజైన్ రన్‌వే. ఆ మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా మిరాండా ప్రీస్లీ చెప్పిందే ఫైనల్. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రింట్ మ్యాగజైన్‌ల స్థానాన్ని డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆక్రమించారు. ఒకప్పుడు ట్రెండ్స్‌ను నిర్ణయించిన మిరాండా… ఇప్పుడు తన మ్యాగజైన్ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది.

Advertisement

ఇదే సమయంలో ఒకప్పుడు ఆమె దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన ఆండీ సాక్స్ ఇప్పుడు విజయవంతమైన జర్నలిస్టుగా ఎదుగుతుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మిరాండా ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. కానీ ఈసారి ఆమె ఉద్యోగిగా కాదు… తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి. మరోవైపు అప్పట్లో మిరాండా వద్ద పని చేసిన ఎమిలీ చార్ల్టన్ కూడా ఇప్పుడు లగ్జరీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కీలక స్థానంలో ఉంటుంది. ఈ ముగ్గురి ప్రయాణం మళ్లీ ఒకే దారిలోకి ఎలా వచ్చింది ? మారిపోయిన ప్రపంచంలో వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ? అనేదే ఈ సీక్వెల్‌లో ప్రధాన కథ.

పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే… కొత్త తరం ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎలా మారిపోయిందో కూడా ఈ సినిమా చూపించే ప్రయత్నం చేస్తుంది. కార్పొరేట్ పోటీ, డిజిటల్ మీడియా ప్రభావం, బ్రాండ్ల మధ్య జరిగే వ్యూహాలు కథను మరింత ఆసక్తికరంగా మార్చేస్తాయి. అయితే అసలు మిరాండా తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోగలిగిందా ? ఆండీ మళ్లీ ఆమెతో కలిసి పని చేసిందా ? చివరకు ఏమైంది ? అనేది మాత్రం తెరపైనే చూడాలి.

తెలుగులో మాత్రం లేదు

Advertisement

ఈ క్లాసిక్ సీక్వెల్ ప్రస్తుతం భారతదేశంలో JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 29 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ డబ్బింగ్‌లో కూడా చూడొచ్చు. మరో పెద్ద ఆకర్షణ ఏంటంటే… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మెరిల్ స్ట్రీప్, ఆన్ హాత్వే, ఎమిలీ బ్లంట్, స్టాన్లీ టుస్సీ మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించడం. వీళ్లతో పాటు లూసీ లియు, జస్టిన్ థెరౌక్స్, సిమోన్ యాష్లే వంటి కొత్త నటీనటులు కూడా ఈ సీక్వెల్‌లో కీలక పాత్రలు పోషించారు. ఫ్యాషన్ ప్రపంచం, కార్పొరేట్ డ్రామాలు కథలు ఇష్టపడేవారికి ఇది మస్ట్ వాచ్ మూవీ. పాత సినిమాను చూసిన వాళ్లకు ఇది నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తే… కొత్త ప్రేక్షకులకు డిజిటల్ యుగంలో మారిపోయిన ఫ్యాషన్ ప్రపంచాన్ని కొత్త కోణంలో పరిచయం చేస్తుంది. ముఖ్యంగా మిరాండా ప్రీస్లీ పాత్రను మరోసారి తెరపై చూడాలనుకుంటే ఈ క్లాసిక్ సీక్వెల్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

Read Also: ప్రపంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు

Tags

Related News

అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో

100 ఎపిసోడ్స్ హిట్… తెలుగు ఆడియన్స్ మెచ్చిన తమిళ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

చేదు గతం… కొత్త జీవితం… ఈ ప్రేమకథ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది

థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ… ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి 4 కొత్త సినిమాలు.. ఆ 2 మాత్రం మిస్ అవ్వద్దు!

Big Stories

Advertisement
×