E-Paper
Advertisement

Jana Nayagan: దళపతి విజయ్ ‘జన నాయకన్’ నుంచి 20 నిమిషాలు కట్?.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

Jana Nayagan: దళపతి విజయ్ ‘జన నాయకన్’ నుంచి 20 నిమిషాలు కట్?.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
Advertisement

Jana Nayagan: దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయకన్’. ఇప్పటకే ఈ సినిమా విడుదలవ్వాల్సింది. అయినే సెన్సార్ కారణాల వల్ల సినిమా విడుదల లేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో విడుదల కోసం ఈ సినిమా నిడివిని సుమారు 20 నిమిషాల మేర తగ్గించారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం స్పందిస్తూ అసలు నిజానిజాలను వెల్లడించింది.

Read also-Upcoming Web Series OTT : హార‌ర్‌ నుంచి యాక్షన్ వరకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న అదిరే బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, సిరీస్‌లు

అసలేం జరిగింది?

Advertisement

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెన్సార్ బోర్డు వద్ద కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అందుకే విడుదల వాయిదా పడిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే, సెన్సార్ బోర్డు కొన్ని “వివాదాస్పద” దృశ్యాలను తొలగించాలని ఆదేశించిందని, అందుకే మేకర్స్ 20 నిమిషాల సినిమాను కట్ చేసి మళ్ళీ రీ-ఎడిట్ చేస్తున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లపై ప్రముఖ తమిళ నిర్మాత జి. ధనంజయన్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు. సినిమాను 20 నిమిషాల పాటు కట్ చేశారన్న వార్తల్లో అస్సలు నిజం లేదు. ఒక కోర్టు కేసు కారణంగా సినిమా సెన్సార్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మేకర్స్ ఇంకా సెన్సార్ కోసం తేదీని కూడా ఖరారు చేయలేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. నిర్మాతల నుండి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని సూచించారు.

Read also-Romantic web Series OTT : ముసుగు సుందరిని ప్రేమించే కోటీశ్వరుడు… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమ కథ

సినిమా గురించి..

Advertisement

‘జన నాయకన్’ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రజా సంక్షేమం, న్యాయం అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విజయ్‌ పూజా హెగ్డే నటిస్తున్నారు. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, మమితా బైజు వంటి వారు ముఖ్యా పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల, సెన్సార్ క్లియరెన్స్ అనేది పూర్తిగా కోర్టు నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. ఈ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రిలీజ్ చివరి నిమిషంలో ఈ సినిమా సెన్సార్ కారణంగా విడుదల వాయిదా పడింది.

Related News

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×