Jani Master Love Story:జానీ మాస్టర్.. తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు కోలీవుడ్ ,బాలీవుడ్లలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించిన ఈ టాలెంటెడ్ డాన్స్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే .ఇక తాజాగా ఫెడరేషన్ సహాయ నిరాకరణ అంటూ జానీ మాస్టర్ పై వేటు వేసిన సంగతి తెలిసిందే .
ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య సమత కూడా మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. అయితే జానీ మాస్టర్ కెరీర్ గురించి తెలిసినప్పటికీ పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా వాళ్ళిద్దరి లవ్ స్టోరీ చాలా మందికి తెలియదనే చెప్పాలి.
వారి ప్రేమ కథ విషయానికి వస్తే జానీ మాస్టర్ ఆయేషాకు డాన్స్ ద్వారానే పరిచయం.తను ఒక క్లాసికల్ డాన్సర్. అయితే ఆయేషా అసలు పేరు సుమలత .ఇద్దరూ డాన్స్ బ్యాగ్రౌండ్ లోనే ఉండటంతో వారి మధ్య ఉన్న పరిచయం కాస్త స్నేహంగా మారింది. అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది.
అయితే వీరి పెళ్లికి మొదట అడుగేసింది మాత్రం జానీ మాస్టరే . ఒకసారి ఇద్దరు లంచ్ చేయడానికి వెళ్లిన సమయంలో సుమలత చేతులు కడుక్కుంటుండగా జానీ మాస్టర్ నువ్వంటే నాకిష్టం నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ మనసులోని మాటను బయటపెట్టాడట .
దీంతో జాని మాస్టర్ ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిందట సుమలత .అయితే సుమలత జానీ మాస్టర్ తో మీరు చాలా స్పీడ్ నేను చాలా స్లో మా ఇద్దరికీ సెట్ అవ్వదేమో అని చెప్పిందట .దానికి జానీ మాస్టర్ సరదాగా రియాక్ట్ అవుతూ అందుకే మన ఇద్దరికీ సెట్ అవుతుంది అంటూ కౌంటర్ ఇచ్చాడట.
అలా మొదలైన వారి ప్రేమ చివరికి పెళ్లి దాకా వెళ్ళింది .చివరికి 2012 మార్చి 30న జానీ మాస్టర్, సుమలతల వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కొడుకు ,ఒక కూతురు. అయితే వీరి పెళ్లి అంత ఈజీగా జరగలేదు. జానీ మాస్టర్ ఇప్పుడంటే ఫేమస్ కొరియోగ్రాఫర్. కానీ అప్పట్లో ఇంకా కష్టాలు పడుతున్న పరిస్థితి. పైగా చేతిలో డబ్బులు కూడా అంతగా లేవు .ఇక వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో డబ్బులు అవసరం పడటంతో తెలిసిన వాళ్ళ దగ్గర దాదాపు 50 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట జానీ మాస్టర్ .
మరోవైపు పెళ్లి షాపింగ్ కూడా చాలా సింపుల్ గానే చేశారట .ఇద్దరు కలిసి చార్మినార్ లోని బట్టల షాపులలో తిరుగుతూ నచ్చిన బట్టలు తీసుకున్నారట .అయితే పెళ్ళికి ముందు సుమలత టెన్షన్ తో నిద్ర పోకుండా గడిపితే ,జానీ మాస్టర్ మాత్రం హాయిగా నిద్ర పోయాడట. మొత్తంగా అలా డాన్స్ తో మొదలైన వారి పరిచయం స్నేహంగా మారి చివరకి పెళ్లి దాక వచ్చేసింది.
ఇక ఆ మధ్య ఒక టీవీ షోలో భార్య సుమలత గురించి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నాడు. తన గురించి ప్రపంచంతోనే ఫైట్ చేసిందని, జీవితాంతం ఆమెతోనే ఉంటానని చెప్పి ఎమోషనల్ అవ్వడం మనం చూశాం కూడా.
also read :చిట్టి ఈసారి ఏం చేస్తుందో..ఫరియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్!
మొత్తానికి జానీ మాస్టర్ ఇపుడు స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు కానీ జానీ మాస్టర్ జీరో గా ఉన్నప్పటి నుంచే సుమలత ఆయనతో కలిసి ప్రయాణం చేసిందన్న మాట.