E-Paper
Advertisement

అమెరికా వీసా మీ చేతిలో ఉందా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

అమెరికా వీసా మీ చేతిలో ఉందా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
Advertisement

US Visa Rules: అమెరికా వీసా ఉందా..? అయితే ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వీసా ఇచ్చిన తర్వాత కూడా విదేశీయుల కార్యకలాపాలను పరిశీలిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినా.. నేరాలకు పాల్పడినా.. వీసా రద్దు చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రద్దైన 2.5 లక్షలకు పైగా వీసాల్లో.. 2,300 వీసాలు బర్త్ టూరిజంకు సంబంధించినవిగా అమెరికా తెలిపింది. అంటే.. అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లే కేసులపై కూడా అమెరికా దృష్టి పెట్టింది.

వీసా వచ్చిన తర్వాత..

ఇక క్రిమినల్ కేసులు కూడా వీసా రద్దులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దాడులు, డ్రంక్ అండ్ డ్రైవింగ్, దొంగతనాలు, డ్రగ్స్ కేసులు వంటి నేరాల్లో పట్టుబడినవారి వీసాలు రద్దు చేసినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ర్యాష్ డ్రైవింగ్, లైంగిక దాడులు, పిల్లలపై వేధింపులు, మోసం, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక్కడ మరో కీలక విషయం అమెరికా ప్రభుత్వం కంటిన్యూయస్ వెట్టింగ్ పై ఫోకస్ పెట్టింది. అంటే.. వీసా వచ్చిన తర్వాత తనిఖీలు ఆగిపోవు. వీసా హోల్డర్ కార్యకలాపాలను కూడా పరిశీలించే విధానం కొనసాగుతుంది. 2016 నుంచి 2026 మధ్య జారీ చేసిన B1, B2 బిజినెస్, టూరిస్ట్ వీసాలతో అమెరికాకు వెళ్లి.. తర్వాత ఆశ్రయం కోరిన వారిలో కూడా దాదాపు 2 లక్షల మందిపై చర్యలు తీసుకునే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

ఇక మరింత నిఘా..

Advertisement

అంటే.. అమెరికా వీసా చేతిలో ఉందని రిలాక్స్ అవ్వడానికి పరిస్థితులు లేవు. వీసా నిబంధనలు పాటించడమే కీలకం. వీసా జారీ తర్వాత కూడా అమెరికా వెట్టింగ్ కొనసాగుతుండటంతో అక్కడికి వెళ్లే విదేశీయులపై ఇక మరింత నిఘా ఉండనుంది.

Also read: దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

Tags

Related News

చిన్న మెదడు టిష్యూస్‌తో సంచలన ప్రయోగం.. బయటపడ్డ అసలు ట్విస్ట్ ఇదే!

ఖమ్మంలో రూ. 34 లక్షల ఎక్సైజ్ శాఖ కొత్త భవనం.. ప్రారంభానికి ముందే పగుళ్లు!

దేశంలో 13 శాతం వర్షపాతం లోటు.. ఆహార భద్రతపై నిపుణులు ఆందోళన!

మహారాష్ట్రలో డేంజర్ బెల్స్.. రైతు రుణాలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు!

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!

గులాబీకి సవాల్‌గా ఖైరతాబాద్ ఎన్నిక.. సరైన అభ్యర్థి ఎంపికకోసం మల్లగుల్లాలు..!

ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

Big Stories

Advertisement
×