Spy Thriller: దేశాన్ని కాపాడే మిషన్ అనుకుంటూ శత్రువుల ప్రాంతంలోకి వెళ్లిన సీక్రెట్ ఏజెంట్ కు… అక్కడ ఎదురయ్యే ప్రమాదం డేంజరస్ గా ఉంటుంది. కంబోడియాలో మొదలైన ఆ మిషన్ చైనాకు చేరేసరికి అసలు టార్గెట్ ఎవరు, శత్రువు వెనుక ఉన్న శక్తి ఏంటి అన్నది తెలిశాక మరింత కష్టంగా మారుతుంది. ‘సర్దార్’లో కనిపించిన స్పై ప్రపంచాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్తూ కార్తీ మరోసారి ఏజెంట్ గా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ (Sardar 2). మరి ఈ స్పై యాక్షన్ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని, ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చిందంటే ?
మొదటి భాగంలో తన తండ్రి సర్దార్ గురించి నిజాలను తెలుసుకున్న విజయ్ కుమార్ ప్రయాణం ఇప్పుడు మరో దశలోకి వెళ్తుంది. దేశానికి సంబంధించిన కీలక మిషన్ లో భాగంగా అతడిని సీక్రెట్ ఏజెంట్ గా కంబోడియాకు పంపిస్తారు. అక్కడ అతడి ముందున్న పని రొటీన్ ఆపరేషన్ లా కనిపించినా… పరిస్థితులు ఊహించనంత వేగంగా మారిపోతాయి. కంబోడియాలో మొదలైన మిషన్ తర్వాత చైనాకు చేరుతుంది.
కొత్త ప్రాంతం, కొత్త శత్రువులు, కొత్త ముప్పులతో విజయ్ ఎదుర్కొనే సవాళ్లు పెరుగుతాయి. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న కుట్రలో అతడు లోతుగా వెళ్లేకొద్దీ తన చుట్టూ ఉన్నవారిని కూడా నమ్మలేని పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఈ మిషన్ కు మరోవైపు బ్లాక్ డ్యాగర్ అనే ప్రమాదకరమైన ప్రత్యర్థి ఉంటాడు. విజయ్ కు, బ్లాక్ డ్యాగర్ కు మధ్య పోరాటం కథలో కీలకంగా మారుతుంది. ఒకవైపు రహస్య ఆపరేషన్ ను పూర్తి చేయాలి. మరోవైపు తనను టార్గెట్ చేస్తున్న శత్రువు ప్లాన్ ను అర్థం చేసుకోవాలి.
ఇక ఈ కథలో కార్తీ మరోసారి రెండు పాత్రల్లో కనిపిస్తారు. గతంలో తండ్రి సర్దార్ ఎదుర్కొన్న గూఢచారి ప్రపంచానికి, ఇప్పుడు విజయ్ ఎదుర్కొంటున్న మిషన్ కు మధ్య ఉన్న సంబంధం కూడా ఇక్కడే బయట పడుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ లొకేషన్లు, గూఢచర్యం, శత్రువుల వ్యూహాలు కలసి కథను హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా మారుస్తాయి. కంబోడియా నుంచి చైనా వరకు సాగిన ఈ మిషన్‌లో విజయ్ ప్రతి అడుగు ప్రమాదంతో నిండి ఉంటుంది. అసలు అతడి టార్గెట్ ఎవరు ? బ్లాక్ డ్యాగర్ ప్లాన్ ఏంటి ? మిషన్ చివరికి ఎక్కడికి దారితీస్తుంది ? అనేదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం.
కార్తీ (Karthi), ఎస్.జే. సూర్య (S. J. Suryah), మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రజిషా విజయన్ తదితరులు నటించిన హై వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. ఈ మోస్ట్ అవైటింగ్ సినిమాకు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళంతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది.