E-Paper
Advertisement

ఏకంగా 6 పెళ్ళిళ్ళు… అతన్ని పెళ్లి చేసుకున్న మహిళలంతా చనిపోతారు… ట్విస్టులతో మతిపోగొట్టే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

ఏకంగా 6 పెళ్ళిళ్ళు… అతన్ని పెళ్లి చేసుకున్న మహిళలంతా చనిపోతారు… ట్విస్టులతో మతిపోగొట్టే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ
Advertisement

True Crime Documentary: ఒక వ్యక్తి జీవితంలో ఏకంగా ఆరు పెళ్లిళ్లు. అందులో నలుగురు భార్యలు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తారు. మొదట ఒక్కో ఘటనకు ఒక్కో కారణం కనిపిస్తుంది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ మరణాల మధ్య సంబంధం ఉందనే అనుమానం పెరుగుతుంది. చివరకు ఓ డిటెక్టివ్, ఓ జర్నలిస్ట్ కలిసి ఆ వ్యక్తి గతాన్ని తవ్వడం మొదలుపెడతారు. అతని మాటల్లో కనిపించే ఆకర్షణ వెనుక ఏదో దాగి ఉందని అనిపిస్తుంది. ఈ నిజ జీవిత క్రైమ్ కేసును ఆధారంగా చేసుకుని రూపొందిన ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీనే ‘ది విడోవర్: టిల్ డెత్ డూ అస్ పార్ట్’ (The Widower: ‘Til Death Do Us Part). మరి ఈ రియల్ క్రైమ్ కథను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు కథ ఏంటి ? అనే విషయంలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

థామస్ రాండాల్ఫ్ అనే వ్యక్తి ఆరు సార్లు పెళ్లి చేసుకున్నాడు. అతని జీవితంలో భార్యల స్థానంలోకి వచ్చిన మహిళల మరణాలు వరుసగా చోటు చేసుకుంటాయి. కొన్ని మరణాలు అనారోగ్యం కారణంగా కనిపిస్తాయి. మరికొన్ని ఘటనలు ప్రమాదాల్లా అనిపిస్తాయి. కానీ ఈ సంఘటనలను కలిపి చూసినప్పుడు ఒక భయంకరమైన క్రైమ్ నమూనా కనిపిస్తుంది. రాండాల్ఫ్ ఆరో పెళ్లి షారన్ కాస్ తో జరుగుతుంది. 2008లో ఆమె ఇంట్లోనే కాల్చి చంపబడుతుంది. అదే సమయంలో ఇంట్లో పని చేసే మైక్ మిల్లర్ కూడా హత్యకు గురవుతాడు.

Advertisement

రాండాల్ఫ్ చెప్పిన సమాచారం ప్రకారం… ఎవరో దొంగతనానికి ట్రై చేసే క్రమంలో తన భార్యను కాల్చి చంపారు. అతను ఆత్మరక్షణ కోసం వచ్చిన దొంగను కాల్చి చంపినట్టు చెబుతాడు. అయితే లాస్ వెగాస్ డిటెక్టివ్ డీన్ ఓ’కెల్లీ కి ఈ కథలో ఏదో తేడా కనిపిస్తుంది. దానికి షారన్ మరణం ఒక్కటే కాదు. రాండాల్ఫ్ గతాన్ని పరిశీలిస్తే అతని మాజీ భార్యల మరణాలు కూడా ఇలాగే అనుమానాస్పదంగా ఉన్నాయని బయట పడుతుంది.

ఇదే సమయంలో డేట్‌లైన్ ఎన్బీసీ నిర్మాత డాన్ స్లేపియన్ కూడా రాండాల్ఫ్ కేసులోకి ఎంట్రీ ఇస్తాడు. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ అతని పాత వివాహాలు, భార్యల మరణాలు, ఇన్సూరెన్స్ డబ్బులు, అతని చుట్టూ ఉన్న అనుమానాస్పద వ్యక్తుల గురించి వివరాలు బయటపడతాయి. రాండాల్ఫ్ వ్యక్తిత్వం కూడా ఈ కేసులో కీలకంగా మారుతుంది. బయటకు ఆకర్షణీయంగా, మాట్లాడటంలో నేర్పుగా కనిపించే అతను విచారణ సమయంలో తన కథను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు.

Advertisement

కానీ సంవత్సరాలుగా సేకరించిన ఆధారాలు అతని గతాన్ని మరో కోణంలో చూపిస్తాయి. కోర్టు విచారణలు, పోలీసు దర్యాప్తు, పాత కేసుల వివరాలు, బాధితుల కుటుంబాల కథలు అన్నీ కలిసినప్పుడు ఈ కేసు సాధారణ హత్య దర్యాప్తు కాదని తెలుస్తుంది. ఆరు పెళ్లిళ్ల వెనుక దాగిన నిజం, అనుమానాస్పద మరణాల మధ్య సంబంధం, చివరకు రాండాల్ఫ్‌ పై వచ్చిన ఆరోపణలు ఈ డాక్యుమెంటరీలో ఉత్కంఠభరితంగా ఉంటాయి.

డాక్యుమెంటరీని ఎక్కడ చూడొచ్చు ?

క్రిస్ స్మిత్ (Chris Smith) దర్శకత్వం వహించిన ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ డిటెక్టివ్ డీన్ ఓ’కెల్లీ, జర్నలిస్ట్ డాన్ స్లేపియన్ దర్యాప్తును బేస్ చేసుకుని నడుస్తుంది. ఈ డాక్యుమెంటరీ సెప్టెంబర్ 30 నుంచి Netflixలో ఇంగ్షీషులో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

నిజ జీవిత పోరాటానికి జాతీయ అవార్డు… 13 ఏళ్లుగా ఓటీటీ కోసం ఎదురుచూసిన మూవీకి మోక్షం… 8.2 రేటింగ్‌తో ఇప్పుడు స్ట్రీమింగ్

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

చనిపోతూ ఫ్రెండ్ ఇచ్చే భారీ కుక్క… వదిలించుకోడానికి నానాతంటాలు… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు

చేతిలో చిన్న పడవ… ముందేమో అంతులేని సముద్రం… ఓటీటీలోకి తెలుగులో అదిరిపోయే అడ్వెంచర్ సిరీస్

టాక్సిక్ ఓటీటీలో బిగ్ ట్విస్ట్?

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×