E-Paper
Advertisement

మోసం చేసిన వారిని ఎప్పటికీ క్షమించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు తప్పు చేస్తే రెండో ఛాన్స్ ఇవ్వరు

మోసం చేసిన వారిని ఎప్పటికీ క్షమించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు తప్పు చేస్తే రెండో ఛాన్స్ ఇవ్వరు
Advertisement

Numerology No Second Chances| కొంతమంది ఎదుటి వ్యక్తులు తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు. మరికొందరు మాత్రం ఒకసారి నమ్మకం కోల్పోతే మళ్లీ దగ్గర కావడానికి ఇష్టపడరు. న్యూమరాలజీ ప్రకారం.. ఒక ప్రత్యేక మూల అంకం ఉన్నవారు సంబంధాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. వీరు ప్రేమ, నమ్మకం, గౌరవం, నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని న్యూమరాలజీ చెబుతోంది.

ఎవరినైనా తమ మనసుకు దగ్గర చేసుకునే ముందు వారి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తారు. అయితే ఒక వ్యక్తి పట్ల నమ్మకం కోల్పోతే ఆ వ్యక్తికి దూరంగా ఉంటారు.

మూల అంకం 8 వారికి నమ్మకం చాలా ముఖ్యం

Advertisement

న్యూమరాలజీ ప్రకారం.. మూల అంకం 8 కలవారు సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరు ఎదుటివారు చెప్పే తియ్యటి మాటల కంటే వారి చేతల్లో నిజాయితీని గమనిస్తారని అంటారు. ఒక వ్యక్తిపై నమ్మకం ఏర్పడితే, ఆ బంధాన్ని మనస్ఫూర్తిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. కష్టకాలంలో తమకు దగ్గరైన వారికి అండగా నిలబడతారు. అయితే పదేపదే నిరాశ ఎదురైతే, ఆ బంధం గురించి మరోసారి ఆలోచించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో బాధ కలిగించే సంబంధం నుంచి దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.

పదేపదే జరిగే తప్పులను సహించరు

అంక జ్యోతిష్య ప్రకారం.. మూల అంకం 8 వ్యక్తులు మొదటి తప్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎదుటివారు తమ తప్పును అంగీకరిస్తే, వారికి మరో అవకాశం ఇస్తారు. తమ ప్రవర్తన మార్చుకోవడానికి నిజాయితీగా ప్రయత్నిస్తే, నమ్మకం తిరిగి ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ అదే తప్పు పదేపదే జరిగితే పరిస్థితి మారవచ్చు.
అబద్ధాలు చెప్పడం లేదా గౌరవం తగ్గించడం వారి అభిప్రాయాన్ని మార్చవచ్చని న్యూమరాలజీ నమ్మకాలు చెబుతున్నాయి.
ఒకసారి ఓర్పు కోల్పోతే, పాత సంబంధాన్ని మళ్లీ అదే స్థాయికి తీసుకురావడం కష్టమవుతుంది.

కోపాన్ని బయటపెట్టకుండా దూరమైపోతారు

Advertisement

ఈ మూల అంకం వారికి కోపం వచ్చిన ప్రతిసారీ గొడవ చేయకుండా ముభావంగా ఉంటారు. తమను బాధించిన వ్యక్తితో మెల్లగా మాట్లాడటం తగ్గించేస్తారు. గతంలో ఉన్న ఆప్యాయత తగ్గడం కూడా వారి మారిన వైఖరికి సంకేతం. వారి ప్రవర్తన బయటకు సాధారణంగానే కనిపించినా, మానసికంగా మాత్రం దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇలా మౌనంగా దూరం కావడం తమను తాము కాపాడుకునే మార్గంగా భావిస్తారు.

గౌరవం కోల్పోతే సంబంధం బలహీనమవుతుంది

న్యూమరాలజీ ప్రకారం.. మూల అంకం 8 వ్యక్తులకు గౌరవం చాలా ముఖ్యం. ఎవరైనా పదేపదే అవమానిస్తే లేదా వారి భావాలను నిర్లక్ష్యం చేస్తే బాధపడతారు. తమ నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిని క్షమించరు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆ సంబంధాన్ని క్రమంగా తెంచుకోవడానికి ఆలోచిస్తారు.

ఏ తేదీల్లో పుట్టిన వారికి మూల అంకం 8 వస్తుంది?

న్యూమరాలజీలో 8, 17 లేదా 26 తేదీల్లో పుట్టిన వారి మూల అంకం 8గా పరిగణిస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారిని సీరియస్‌ స్వభావం, ఆత్మగౌరవం ఉన్నవారిగా భావిస్తారు. వీరు తమకు దగ్గరయ్యే వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకుంటారని న్యూమరాలజీ చెబుతోంది. నమ్మిన వ్యక్తుల నుంచి కూడా నిజాయితీ, విశ్వాసం, గౌరవాన్ని ఆశిస్తారు.

Also Read: పట్టువదలని విక్రమార్కుడు.. 15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్

మూల అంకం ఒక్కటే వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు

ఒక వ్యక్తి ప్రవర్తనను కేవలం న్యూమరాలజీ ఆధారంగా అతని మూల అంకంతో నిర్ణయించలేం. కుటుంబం, పెంపకం, జీవిత అనుభవాలు, విలువలు, పరిస్థితులు కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఎవరి స్వభావాన్ని అర్థం చేసుకోవాలన్నా వారి నిజ ప్రవర్తనను గమనించడం ముఖ్యం.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌పై రూ.కోట్లు ఖర్చు చేసిన వ్యాపారవేత్త.. బ్రేకప్ తరువాత తిరిగివ్వాలని కోర్టులో కేసు.. చివరికి

Related News

ఫోన్ చోరీ అయిందా? మీ బ్యాంక్ ఖాతాను కాపాడేందుకు వెంటనే ఈ 5 పనులు చేయండి

చాటింగ్‌లో మనసును తాకే మాటలు, కవిత్వాలు.. నిజజీవితంలో మాత్రం బోర్.. ఎందుకలా?

జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా ఉండాలా? ఈ సింపుల్ వాకింగ్ టెక్నిక్స్ చేస్తే సరి

మూత్రంలో రక్తం రావడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. గుండెలో సూది చూసి షాకైన డాక్టర్లు..

బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్.. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసే 5 పాస్తా రెసిపీలు

మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరసంగా అనిపిస్తోందా? రోజంతా ఫుల్ ఎనర్జీ కోసం సింపుల్ టిప్స్

Big Stories

Advertisement
×