Dorothy Telugu Release: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)ఒకరు. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. కీర్తి సురేష్ సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడదగ్గ సినిమా అనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. సినిమాల పరంగా కీర్తి సురేష్ ఎలాంటి రొమాంటిక్ సీన్లలో నటించకుండా, నటన విషయంలో కొన్ని బౌండరీలను పెట్టుకొని సినిమాలలో నటిస్తూ ఉంటారు.
ఇలా హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి కీర్తి సురేష్ ఊహించిన విధంగా ఒక బోల్డ్ సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన బోల్డ్ మూవీ డోరతీ(Dorothy). టొరంటోన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అనంతరం సోషల్ మీడియా వేదికగా సినిమాపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలతో పాటు LGBTQ కంటెంట్ ఉన్న నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి.
నిజానికి ఇలాంటి బోల్డ్ సన్నివేశాలతో ఉన్న ఈ సినిమాని మలేషియాలో బ్యాన్ చేశారు. ఈ సినిమా చూసిన అనంతరం సెన్సార్ అధికారులు ఈ సినిమాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా మలేషియాలో బ్యాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలో విడుదల అయ్యి విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ సినిమాని తెలుగులో విడుదల చేయటానికి కూడా చిత్ర బృందం సిద్ధమయ్యారు. ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ స్పిరిట్ మీడియా(Spirit Media) కైవసం చేసుకున్నారు. స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమా ఏపీ తెలంగాణలో విడుదలకు సిద్ధమైంది.
ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాని గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మలేషియాలో బ్యాన్ చేయటం, తమిళంలో విమర్శలు వస్తున్న ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు కీర్తి సురేష్ సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించారు. మరి సోషల్ మీడియాలో నెగెటివిటీని ఎదుర్కొంటున్న ఈ సినిమా తెలుగు రిలీజ్ అయ్యి ఇక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: నాని ‘ది ప్యారడైజ్ ‘ మూవీలో కేసీఆర్ ను అవమానించారు: కవిత