Kavitha On The Paradise Movie: నాచురల్ స్టార్ నాని (Nani)ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ విడుదల అయ్యి మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో ఊహించని విధంగా పొలిటికల్ లీడర్స్ ఎంట్రీ హైలెట్ గా నిలిచింది. ఇందులో సీనియర్ రాజకీయ నాయకులు దివంగత నేత నందమూరి తారక రామారావుతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గురించి కూడా చూపించారు.
ఈ సినిమాలో కెసిఆర్ పాత్రలో నటుడు ప్రియదర్శి (Priyadarshi)అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కెసిఆర్ పాత్రకు థియేటర్లలో చాలా మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా ఈ సినిమా తెలంగాణ మూలాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) నేడు సాయంత్రం ఈ సినిమా థియేటర్లలో చూడబోతున్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ కుమార్తె కవిత (Kavitha)ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా కవిత నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కెసిఆర్ గురించి చూపిస్తూ ఆయనని చాలా అవమానించారని మండిపడ్డారు. ఈ సినిమా దర్శకుడు తెలంగాణ బిడ్డ అయినప్పటికీ సినిమా బాగాలేదని, అందుకే సరిగ్గా ఆడడం లేదని కవిత తెలిపారు. నాకు ఈ సినిమా నచ్చలేదు అందుకే నేను చూడనని ఈమె తెలిపారు. తెలంగాణ సాధించిన కెసిఆర్ గురించి చాలా అవమానకరంగా చూపించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పాటలకు డబ్బులు ఇచ్చి మరి డాన్సులు చేయిస్తున్నారని ఈమె మండిపడ్డారు.
ఇకపై భవిష్యత్తులో బిఆర్ఎస్ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతుందని ఈమె తెలిపారు. ఈ విధంగా నాని సినిమా గురించి ఈ సినిమాలో కెసిఆర్ పాత్ర గురించి కవిత మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో వచ్చిన విభేదాలు కారణంగానే కవిత బిఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో ఈమె తెలంగాణలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక వచ్చే వేసవి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈమె పాదయాత్ర చేస్తానని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.
Also Read: రూ.15 లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మిథిలేష్..ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!