Salman Khan – Katrina Kaif: ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు అయితే ఈమె ఇటీవల బయటకు రావడంతో తనపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. అంబానీ కుటుంబంలో జరిగిన వినాయక చవితి వేడుకలలో భాగంగా ఈమె తన భర్తతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కత్రినా కైఫ్ శరీర బరువు పెరగడంతో ఈమె శరీర బరువుపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. పాప పుట్టిన తర్వాత కత్రినా కైఫ్(Katrina Kaif) బయట ఇక్కడ కనిపించలేదు అయితే మొదటిసారి బయట కనిపించిన ఈమె శరీర బరువు భారీగా పెరిగిపోవడంతో విమర్శలు కురిపించారు.
ఇలా తన పట్ల వస్తున్నటువంటి ఈ బాడీ షేమింగ్ ట్రోల్స్ పై కత్రినా కైఫ్ ఘాటుగా స్పందించారు తాను అందం కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. ఆరోగ్యపరంగా తాను చాలా అందంగా ఉన్నానని తన గురించి వచ్చే విమర్శలపై ఈమె కాస్త ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా నటుడు సల్మాన్ ఖాన్ సైతం కత్రినా కైఫ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ… పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు బరువు పెరగడం అనేది చాలా సహజం.
ఇలా ఒక మహిళ బరువు గురించి ట్రోల్ చేయటం సరికాదు. ప్రస్తుతం కత్రినా కైఫ్ తన ఫ్యామిలీతో కలిసి పూర్తి సమయం గడుపుతూ చాలా సంతోషంగా ఉన్నారు. తిరిగి ఆమె ఏదైనా ప్రాజెక్టులకు కమిట్ అవుతూ సినిమాలో షూటింగ్ లలో పాల్గొంటే కచ్చితంగా ఇదివరకు ఉన్న విధంగానే తయారవుతారని, తన గురించి వస్తున్న ఇలాంటి విమర్శలను కత్రినా కైఫ్ అసలు పట్టించుకోకూడదు అంటూ ఆమెపై వస్తున్నటువంటి విమర్శల పట్ల సల్మాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ఇటీవల పాపరాలజీ పై కూడా సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే .ఏదైనా ఒక ఈవెంట్లో సెలబ్రిటీలు పాల్గొంటే వారిని వెనకవైపు నుంచి ఫోటోలు తీస్తూ ఇక్కడ ఎవరున్నారో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఇలాంటి చర్యలను మానుకోవాలి అంటూ ఫోటోగ్రాఫర్ల తీరుపై కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే హీరోయిన్లందరూ ఏకతాటి పైకి వచ్చి అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్న వారి చెంప పగలగొట్టాలి అంటూ సల్మాన్ ఖాన్ పాపరాలజీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా హీరోయిన్ల విషయంలో ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: బరువు పెరిగితే అవకాశాలు ఉండవు..బాడీ షేమింగ్ కామెంట్స్ నటి ఆవేదన!