E-Paper
Advertisement

హీరో విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ?

హీరో విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ?
Advertisement

Hero Vishal: ఒకప్పుడు చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటారు. ఆ తర్వాత వచ్చిన హీరోలు కొంతమంది రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలని చూసినా కుదరలేదు. మరికొంతమంది రాజకీయాల్లోకి అడుగుపెట్టినా కలిసి రాక మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ తరం హీరోలు ఎక్కువగా రాజకీయాల్లో సత్తా చాటాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అధికారంలోకి కూడా వెళ్తున్నారు. అలా ఇటీవల టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రిగా అవతరిస్తే.. అటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) తమిళనాడులో ఏకంగా ముఖ్యమంత్రిగా అవతరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

రాజకీయాల్లోకి హీరో విశాల్..

ఈ క్రమంలోనే ఇటు టాలీవుడ్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా రాజకీయ ప్రవేశం చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అటు కోలీవుడ్ నుంచి కూడా సూర్య, రాఘవ లారెన్స్, ధనుష్ వంటి హీరోలు రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ (Vishal) కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తాజాగా ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాను – హీరో విశాల్..

Advertisement

ఇటీవల ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆయన..” ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నటుడిగా మీ నుంచి నేను ఎంతో ప్రేమను పొందాను. ఆ అభిమానానికి ప్రతిఫలంగా మీకు ఏదో ఒకటి తిరిగి చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను. అందుకే నా ప్రయాణం గతంలో మాదిరి సాధారణంగా కాకుండా నేరుగా అత్యంత నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అన్ని రకాలుగా మీకు అండగా , అందుబాటులో ఉంటాను” అంటూ ప్రకటించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

also read:హీరో జయంరవికి కోర్టులో ఊరట.. భార్యకి షాక్!

అందుకే కొత్త రక్తం రాజకీయాల్లోకి వస్తోంది – విశాల్

Advertisement

ఇదిలా ఉండగా.. ఇప్పటికే నడిగర్ సంఘం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యతలలో తనదైన ముద్రవేసిన ఈయన.. గతంలో ఆర్కే నగర్ ఉపఎన్నికలలో పోటీకి యత్నించిన విషయం తెలిసిందే. ఇక రాజకీయ నాయకులు సరిగా పనిచేయనందుకే కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాల్సి వస్తోందని.. త్వరలోనే తన రాజకీయ పయనానికి సంబంధించిన పూర్తి విషయాలను వెల్లడిస్తానని విశాల్ స్వయంగా వెల్లడించారు. తన అభిమాన సంఘాన్ని ప్రజాసేవ కోసం కూడా నడిపిస్తానని తెలిపారు. ఏది ఏమైనా విశాల్ చేసిన ఈ కామెంట్లు ఆయన రాజకీయ ఎంట్రీ పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

విశాల్ సినిమాలు..

విశాల్ సినిమాల విషయానికొస్తే.. మకుటం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుందర్ . సి దర్శకత్వం వహిస్తుండగా.. విశాల్ ఇందులో మూడు డిఫరెంట్ గెటప్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, దుషారా విజయన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పైగా ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తన 36వ చిత్రాన్ని కూడా సుందర్ . సీ దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. కామెడీ , యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. పైగా ఈ చిత్రానికి మొగుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Related News

బన్నీ మూవీలో హీరోయిన్ ఉండదా? మార్క్ చూపించబోతున్న లోకేష్!

ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా?.. కృతి సనన్ -కబీర్ ఫోటో వైరల్

హీరో జయంరవికి కోర్టులో ఊరట.. భార్యకి షాక్!

“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!

ఫ్యాన్స్ మీట్ లో అల్లు అర్జున్.. ట్రోల్స్ వద్దు బ్రదర్!

Big Stories

Advertisement
×