E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

స్పైడర్ మ్యాన్ తాజా ప్రోమోలో మెస్సీ.. 20 సెకన్ల యాక్టింగ్‌కు ఎన్ని కోట్లో తెలుసా ?

స్పైడర్ మ్యాన్ తాజా ప్రోమోలో మెస్సీ.. 20 సెకన్ల యాక్టింగ్‌కు ఎన్ని కోట్లో తెలుసా ?
Advertisement

Messi SpiderMan: సినిమా ప్రోమోలో మెస్సీ….అదేంటి పుట్ బాల్ గ్రౌండ్ లో ఆడాల్సిన లియోనెల్ మెస్సీ సినిమా ప్రోమోలో కనిపించడం ఏంటి అనుకుంటున్నారా…యస్ ..అదే ఇక్కడ ట్విస్ట్ మరి. బాల్ ప్రత్యర్దులకి దొరక్కుండా ముప్పు తిప్పలు పెట్టించే ఈ లెజెండ్ పుట్ బాల్ ప్లేయర్ కాస్త చేంజ్ అంటూ సినిమా ప్రోమోలో దర్శనమిచ్చాడు.అది జస్ట్ 20 సెకన్లు మాత్రమే మరి.ఇంతకీ ఆ లక్కీ సినిమా ఏంటి అంటారా ..అదే స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’సినిమా .టామ్ హోలాండ్, జెండాయ జంటగా నటిస్తున్న ఈ సినిమా జూలై 31న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.

20 సెకన్లు.. 140 కోట్ల రూపాయలు 

అసలే వరల్డ్ మొత్తం ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఫీవర్ తో ఊగిపోతుంది.ఇలాంటి సమయంలోనే ఆ ఫీవర్ ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనతో ప్రమోషన్స్ లో మెస్సీ ని దించింది చిత్ర యూనిట్.ఇక మూవీ లవర్స్ కి ఇదే ఒక షాక్ అంటే ఈ ప్రోమోలో నటించినందుకు గాను మెస్సీ అందుకున్న పారితోషికం ఇంకా పెద్ద షాక్ ఇచ్చేదే. అవును ..ఈ సినిమా కోసం డిజైన్ చేసిన ప్రోమోలో కనిపించేందుకు గాను మెస్సీ తీసుకున్న పారితోషికం 15 మిలియన్ డాలర్లు మరి. అంటే మన ఇండియన్ కరెన్సీ లో అక్షరాల 140 కోట్ల రూపాయల భారీ మొత్తమన్న మాట.

Advertisement

అయితే ఈ హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజీకి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అలాంటి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మెస్సీ ని ,అది కూడా కేవలం 20సెకన్ల కోసం అంత డబ్బు తగలేయడం ఏంటో అంటూ కొందరు వాదిస్తున్నారు.నిజానికి అది వాస్తవం కూడా. మెస్సీ లాంటి స్టార్ ప్లేయర్స్ ఎవరూ ప్రమోషన్స్ చేయకుండానే స్పైడర్ మ్యాన్ ప్రాంచైజీలు కోట్లు కొల్లగొట్టాయి.అంతటి సత్తా ఉన్న ఈ సినిమాలకి కొత్తగా మరెవరో బూస్టప్ ఇచ్చేది ఏముంటుంది అనేది స్పైడర్ మ్యాన్ మూవీ ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్.

ఇండియాలో  జులై 30నే వస్తున్న సినిమా 

అయితే ఇదే విషయంపై మరికొందరు సినిమా టీమ్ కి సపోర్ట్ చేసుకువస్తున్నారు.సినిమా కంటెంట్ వైజ్ గా, క్రేజ్ వైజ్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా లియోనల్ మెస్సీ వంటి గ్లోబల్ పుట్ బాల్ ప్లేయర్ యాడ్ అయితే సినిమాకి పెట్టిన పెట్టుబడికి వందల రెట్లు లాభాలు వస్తాయని ,మెస్సీ సినిమాకి తెచ్చే మైలేజ్ మాములుగా ఉండదని అది సినిమా రిలీజ్ అయితే కాని కాసుల రూపంలో అర్థం కాదని వాదిస్తున్నారు మెస్సీ ఫాలోవర్స్.

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే దీనికి ముందు వచ్చిన ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ (2021) చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 1.9 బిలియన్ డాలర్లను కొల్లగొట్టి వరల్డ్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిందన్న సంగతి తెల్సిందే.సో వరల్డ్ వైడ్ గా అంతటి మార్కెట్ ఉంది కాబట్టే సోనీ పిక్చర్స్ ప్రమోషన్స్ కి డబ్బుని మంచి నీళ్ళలా ఖర్చుపెట్టేస్తుందని ఇన్ సైడ్ టాక్.ఇక ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఏంటంటే జులై 31 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఇండియాలో మాత్రం ఒకరోజు ముందుగా అంటే జులై 30నే వస్తుండడం విశేషం.

ఏది ఏమైనా స్పైడర్ మ్యాన్’ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడాలి మరి మార్వెల్ కామిక్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మెస్సీ ఎలాంటి మ్యాజిక్ యాడ్ చేస్తాడో !

also read:రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి.. డెలివరీ బాయ్ వివాదమే కారణమా?

Related News

‘అంజి’ కష్టాలు రిపీట్ అవుతున్నాయా..? ‘విశ్వంభర’ లేటెస్ట్ లీక్స్‌తో తలపట్టుకుంటున్న ఫ్యాన్స్!

ఆదర్శ కుటుంబం కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..గూస్ బంప్స్ గ్యారెంటీ!

నాడు ఉపాసన.. నేడు సురేఖ.. మెగా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవులు!

5 మంది హీరోయిన్స్ తో టాక్సిక్ నుండి అదిరిపోయే వీడియో రిలీజ్.. యశ్ లుక్స్ చూసారా?

సమంత క్యూట్ బేబీ బంప్ లుక్ వైరల్..పోస్ట్ వైరల్!

Kayadu lohar: 10వ తరగతిలోనే తల పగలగొట్టిన కాయాదు లోహర్.. ఏం జరిగిందంటే?

Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..

Big Stories

×