Iron Box vs Garment Steamer: సాధారణంగా బట్టలపై ముడతలు పోవడానికి ఇస్త్రీ పెట్టెను వాడుతుంటారు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత కలిగిన గార్మెంట్ స్టీమర్లు సైతం ఇస్త్రీ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ముడతలు పోగొట్టడానికి ఈ రెండింటిలో ఏది బెటరన్న ప్రశ్న సహజంగానే చాలా మందికి కలుగుతూ ఉంటుంది. మరి బట్టలను త్వరగా, సురక్షితంగా, ముడతలు లేకుండా మార్చే ఆ పర్ఫెక్ట్ ఆప్షన్ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కాటన్ దుస్తులు, మందపాటి లినెన్ బట్టలను ఎక్కువగా వాడేవారికి ‘ఐరన్ బాక్స్’ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాగే ఫార్మల్ షర్టులు, ఆఫీస్ వేర్ ప్యాంట్లకు మడత పెట్టిన గీతలు కావాలనుకుంటే ఐరన్ తోనే సాధ్యమవుతుంది. ఐరన్ బాక్స్ బరువు, దాని నుండి వచ్చే వేడి వల్ల.. బట్టలపై ఉండే ముడతలను మాయం చేసి దుస్తులను చాలా వేగంగా ఫ్లాట్‌గా మారుస్తాయి. డెనిమ్, కాటన్ దుస్తులు, ఫార్మల్స్, బెడ్ షీట్లను పద్ధతిగా ఇస్త్రీ చేయడానికి ఐరన్ బాక్స్ నెంబర్ వన్ అని నిపుణులు సూచిస్తున్నారు.
గార్మెంట్ స్టీమర్ అనేది నీటి ఆవిరి (Steam) ద్వారా ముడతలను తొలగిస్తుంది. బట్టలను హ్యాంగర్‌కు తగిలించి నిలువుగా దీనిని ఉపయోగిచాల్సి ఉంటుంది. పట్టు చీరలు, రేయాన్, పాలిస్టర్, సీక్విన్ (మెరిసే పూసలు ఉన్న), వర్క్ బట్టలకు స్టీమర్ చాలా సురక్షితమని చెప్పవచ్చు. ఇవి ఐరన్ బాక్స్ తగిలితే కాలిపోయే ప్రమాదం ఉంటుంది. పైగా స్టీమర్ తో.. ఇస్త్రీ బల్ల సెట్ చేసుకునే పని లేకుండా హ్యాంగర్ ద్వారానే బట్టలను ఈజీగా ముడతలు పోగొట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వేడి ఆవిరి బట్టల్లోని ముడతలను తీయడమే కాకుండా బ్యాక్టీరియాను చంపి, చెమట వాసనలను కూడా పోగొడుతుందని తెలియజేస్తున్నారు.
Also Read: వీఐ సరికొత్త ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 1800GB డేటా, అపరిమిత కాల్స్!
ముడతలు పర్ఫెక్ట్‌గా పోవాలి, మడత లైన్స్ కావాలి అనుకుంటే ఐరన్ బాక్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. అలాకాకుండా డిజైనర్ దుస్తులు, సిల్క్ బట్టలు ఎక్కువగా వాడుతూ ప్రతీసారి ఇస్త్రీ బల్ల సెట్ చేసుకునే ఓపిక లేనివారికి గార్మెంట్ స్టీమర్ బెటర్. అయితే ప్రస్తుతం చాలామంది ఇళ్లలో ఇప్పుడు ఈ రెండు వస్తువులను సందర్భాన్ని బట్టి వాడుతున్నారు. కాబట్టి బడ్జెట్ సమస్య లేకుంటే ఈ రెండింటిని కొనుగోలు చేసి.. అవసరానికి అనుగుణంగా వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!