Madhuri Rathod Popular Folk Songs:మాధురి రాథోడ్ …గత కొంతకాలంగా తనదైన ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ఈ భామ తాజాగా ఈశ్వర్ సాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఒకసారిగా మీడియాలో హైలెట్ అయిపొయింది.ఇక అప్పటి నుండి ఎక్కడ చూసినా వీరిద్దరి గురించిన విషయాలే దర్శనమిస్తున్నాయి.
ఇక ఈక్రమంలోనే ఆడియన్స్ లో విశేషమైన ఫ్యాన్ బేస్ కలిగిన మాధురి రాథోడ్ చేసిన ఫోక్ సాంగ్స్ ఏవీ అంటూ ఆరాలు తీసేపనిలో పడ్డారంతా .మరి ప్రేక్షకులని ఉరూతలూగించిన ఆ జానపదాలేంటో చూసేద్దాం రండి !మాధురి రాథోడ్ చేసిన పాటల విషయానికి వస్తే ఈ ఫోక్ డాన్సర్ ఎక్కువగా ఈశ్వర్ సాయి తోనే కలిసి డాన్స్ చేయడం విశేషం.వీటిలో
* ప్రమీల
* రాతిరి రాతిరి రాతిరిలో
* సీటీ చీర
* సన్న సన్న బియ్యమే
* కళ్లకు కాటుక దిద్దినారో
* అది అబ్బబ్బాగా పోరి
* లయి లయి లబ్బరి బొమ్మ
also read :ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?
ఇలా దాదాపు ఏడెనిమిది పాటల్లో కలిసి కనిపించారు.అయితే వీటికి ఇప్పటి వరకు పర్లేదనిపించే స్థాయిలోనే వ్యూస్ వచ్చినప్పటికీ ,ఏ ముహూర్తాన వీరిద్దరూ కలిసి వేములవాడ లోని రెడ్డి భవన్ లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య కి రెడ్ హ్యాండెడ్ గా దొరికారో,ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య వచ్చిన పాటలు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం ఇక్కడ విశేషం.
ఇక ఇవే కాకుండా మాధురి రాథోడ్ ఇతర పాటల విషయానికి వస్తే
ఇలా మరికొన్ని ఫోక్ సాంగ్స్ లో నటించింది. అయితే వీటిలో ముఖ్యంగా మాధురి రాథోడ్ కి ఎక్కువగా గుర్తింపు తెచ్చిన పాటలని చూస్తే ప్రమీల, నిమ్మతోట వనములో, సన్న సన్న బియ్యమే, సీటీ చీర, రాతిరి రాతిరి రాతిరిలో అని చెప్పుకోవచ్చు.
also read :ఈశ్వర్ సాయి ఫుల్ లవ్ స్టోరీ.. వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఇలా ఫోక్ ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ తో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయితో అడ్డంగా తప్పటడుగు వేసి తన ఫ్యూచర్ కి ఎండ్ కార్డ్ వేసుకుందనే చెప్పాలి !చూడాలి మరి వీటన్నింటిని దాటుకుని ఈ టాలెంటెడ్ ఫోక్ సింగర్ ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తుందో !