E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి ఫుల్ లవ్ స్టోరీ.. వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఈశ్వర్ సాయి ఫుల్ లవ్ స్టోరీ.. వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Advertisement

Eshwar Sai Love Marriage Story: ఈశ్వర్ సాయి ..బాసింగ బలాలే అంటూ ఈ మధ్య సూపర్ హిట్ ఫోక్ సాంగ్ లో అదరగొట్టిన ఈ టాలెంటెడ్ డాన్సర్ మూడు రోజుల కింద ఓ కాంట్రవర్సీలో ఇరుకున్న సంగతి తెల్సిందే. తన తోటి డాన్సర్ మాధురి రాథోడ్ తో అడ్డంగా దొరికిపోవడంతో ఇపుడు ఎక్కడ చూసినా వీరి వార్తలే దర్శనమిస్తున్నాయి.

ఇక ఇదే క్రమంలో గత కొన్ని రోజుల కింద ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈశ్వర్ సాయి వీడియోలు ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతున్నాయి,ఇక ఈ వీడియోలో తన ప్రేమ పెళ్లి సంగతుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.మరింతకీ అవేంటో మనమూ చూసేద్దాం.

మా ప్రేమ ఎలా మొదలైందంటే 

Advertisement

ఆ ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి మాట్లాడుతూ తమ పరిచయం టిక్‌టాక్ టైమ్‌లో మొదలైందని చెప్పుకొచ్చాడు. తన ప్రొఫైల్ చూసి మొదట శరణ్య నే ఇన్స్టాగ్రామ్‌లో చూసి తనకి మెసేజ్ చేసిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు.ఇక అలానే మెల్లిగా తామిద్దరి మధ్య మాటలు పెరిగాయని తెలిపాడు.

ఇంట్లో చెప్పకుండా సైలెంట్‌గా

ఇక ఆ క్రమంలోనే తను చూపించే శ్రద్ధ, అన్నం తిన్నావా, సరిగ్గా నిద్రపోతున్నావా అంటూ నిమిషానికోసారి అడిగే కేరింగ్ తనను బాగా ఆకట్టుకుందని, ఇంతకంటే ఎక్కువ ప్రేమించే భార్య తనకు దొరకదనిపించిందని గుర్తుచేసుకున్నాడు. ఇంట్లో చెప్పకుండా సైలెంట్‌గా ఒక పెద్ద కళ్యాణమండపంలో పెళ్లి చేసుకున్నామని, అక్కడ పురోహితుడు, అతని సహాయకుడు, ఐదుగురు స్నేహితులు తప్ప ఎవరూ లేరని తెలిపాడు.

 వీటి వెనుక ఉన్నది నా భార్యే

Advertisement

బయట తన హెయిర్‌స్టైల్, లుక్స్ చూసి అందరూ పొగుడుతుంటారు కానీ, దాని వెనుక ఉన్నది తన భార్యేనని, తన ఫేస్ కేర్, వాడే షాంపూలు, సీరమ్‌లు అన్నీ ఆమే స్వయంగా చూసుకునేదని వివరించాడు. చిన్నతనం నుంచే గుంటూరులో సొంతంగా సంపాదించడం మొదలుపెట్టి, ఆ తర్వాత జిమ్ ట్రైనర్‌గా, మోడలింగ్‌గా ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చానని పంచుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఈశ్వర్ సాయి ట్రెండింగ్ లో ఉండటంతో ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్‌ను ఎడిట్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఈశ్వర్ సాయి తన భార్యపై చూపించిన అనురాగం, ఆమె గురించి మాట్లాడిన తీరు చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో !

అయితే ఇక్కడ ఈశ్వర్ సాయి తప్పులేదని ఆ అమ్మాయే తన భర్తని బుట్టలో వేసుకుందని  భార్య శరణ్య అంటుంటే రెండు చేతులు దగ్గరికి అయితేనే చప్పట్లు అని ఇలా ఒకరినే టార్గెట్ చేయడం సరికాదు అంటూ ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. చూడాలి మరి ఈ వివాదానికి ఎలా ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో !

ఏది ఏమైనా ఇద్దరు ఇష్టపడి చేసుకున్న పెళ్లి ఇలా మూడో మనిషి రాకతో గందరగోళం అవ్వడం నిజంగా బాధాకరం.

Tags

Related News

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Big Stories

Advertisement
×