E-Paper
Advertisement

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజాకు అరుదైన గౌరవం!

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజాకు అరుదైన గౌరవం!
Advertisement

Ilayaraja: సినీ ఇండస్ట్రీలో గర్వించదగ్గ సంగీత దర్శకులలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా (Ilayaraja) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈయన సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు .ఇలా 50 ఏళ్లలో వందలాది సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ఎంతోమంది సంగీత ప్రియులను మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలతో పాటు ఇతర భాషలలో కూడా అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజా గారికి ఉంది. ఇలా ఈయన దాదాపు 50 సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీకి అందిస్తున్న సేవలకు గాను అరుదైన గౌరవం లభించింది.

పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ఆస్ట్రేలియా..

ఇళయరాజా 50 సంవత్సరాల తన సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవడంతో ఈయన అందించిన సేవలకు కాను ఆస్ట్రేలియా ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఇళయరాజ సేవలకు గాను ఆస్ట్రేలియా పార్లమెంట్ తపాలా బిల్లను విడుదల చేసి గౌరవించింది. ఆస్ట్రేలియాలోనీ విక్టోరియా పార్లమెంట్ భవనంలో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విక్టోరియా ఆర్థిక శాఖ మంత్రి పాల్గొని ఈ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సినీ సంగీత ప్రేమికులు ఇళయరాజా గారికి దక్కిన ఈ గౌరవం పట్ల అభినందనలు తెలుపుతున్నారు.

50 ఏళ్ల సంగీత ప్రయాణం..

Advertisement

ఇక ఇళయరాజ గారి ఫోటోతో పోస్టల్ స్టాప్ రావడంతో ఈయన తనకు దక్కిన గౌరవం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇకపోతే ఇళయరాజా సినీ సంగీత దర్శకుడిగా 50 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకున్న నేపథ్యంలో జూలై చివరి నుంచి ఈయన ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికలపై ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ సిడ్నీలో అలాగే అక్టోబర్ 5వ తేదీ బ్రిస్బెన్ లో సంగీత కచేరీలు నిర్వహించబోతున్నారు.

?stkn=a2psMzV1dm51cDEw

Advertisement

ఇక ఈయన 50 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి కావడంతో గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం ఈయనని సత్కరించిన సంగతి తెలిసినదే. గత ఏడాది సెప్టెంబర్ నెలలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఎంకే స్టాలిన్ చేతుల మీదగా ఈయన సత్కారం అందుకున్నారు. ఇక ఇళయరాజా వ్యక్తిగత విషయానికి వస్తే జూన్ మూడవ తేదీ 1943వ సంవత్సరంలో తమిళనాడులోని పన్నైపురంలో జన్మించారు. ఇళయరాజా అసలు పేరు డేనియల్ జ్ఞానాతేసిగన్ . చిన్నప్పటినుంచి జానపద సంగీతం వింటూ పెరిగిన ఇళయరాజా తన అన్నయ్య వరదరాజన్ వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకొని లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి క్లాసికల్ గిటార్ వాయించడంలో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్నారు. సంగీతం పై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వందల సినిమాలకు సంగీతం అందించారు.

Also Read: 16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. నాని వైఫ్ అంజనా పోస్ట్ వైరల్!

Related News

వెళ్ళడానికి వీళ్లేదు..నానికి పోలీసులు బిగ్ షాక్!

తరుణ్‌కు భారీ హిట్.. ఏవీఎస్‌కు మరో టెన్షన్! ‘అంకుల్’ వెనుక కథ ఇదేనా?

13 ఏళ్ల ప్రేమకు బ్రేక్.. విడిపోతున్న స్టార్ కపుల్..?

16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. నాని వైఫ్ అంజనా పోస్ట్ వైరల్!

మా కుటుంబాన్ని మార్చేసిన రోజు..చిరు 48 ఇండస్ట్రీ జర్నీ పై చరణ్ ఎమోషనల్ పోస్ట్!

ఆ రోజు చిన్న రోల్.. ఈ రోజు వంద కోట్ల సినిమా.. సుహాస్ జర్నీ ఇదే!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో సుమలతకు షాక్..రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు!

Big Stories

Advertisement
×