Mahesh Babu Birthday:ఆగస్టు 9.. ఈ డేట్ అంటే ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. అవును.. ఆ రోజే సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు మరి.అయితే ఈసారి మాత్రం పండగ కన్నా టెన్షనే ఎక్కువ కనిపిస్తోంది.
ఎందుకంటే జక్కన్న సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వకపోతేనే మేము ఇస్తామంటూ సినిమాలోని షూటింగ్ క్లిప్స్‌ని లీకులుగా వదులుతున్నారు లీకురాయుళ్లు.అలా ఇప్పటికే ఒక లీకైన వీడియో ట్విట్టర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది కూడా.దీంతో లీకులైతే తెగ వస్తున్నాయి.. కానీ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ మాత్రం ఇంకా రావట్లేదంటూ డిసప్పాయింట్ అయిపోతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.
నిజానికి వాళ్ల బాధకు అర్థం ఉంది.ఎందుకంటే ‘గుంటూరు కారం’ వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోయింది.అప్పటినుంచి మహేష్ బాబు సినిమా ఏదీ థియేటర్లలోకి రాలేదు.ఇక ఒప్పుకున్న ‘వారణాసి’ నుంచి అప్పుడెప్పుడో వచ్చిన గ్లింప్స్ తప్ప ఇప్పటివరకు మరో అప్డేట్ వదల్లేకపోయాడు జక్కన్న.దీంతో అడపాదడపా సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు, ఫోటోలు చూసుకుంటూ మురిసిపోవడమే ఘట్టమనేని అభిమానుల వంతయింది.
మరోవైపు మహేష్ బాబు కూడా తన రేంజ్ మరింత పెరిగిపోతుందని ఆశతో జక్కన్నతో సినిమా చేయడానికి సై అన్నాడు.ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత మరో సినిమాకి కమిట్ కాలేకపోయాడు.అలా మహేష్ చేసిన త్యాగాలు బోలెడు.దీంతో మా హీరో గారి నుంచి కనీసం ఇప్పటికైనా పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే సర్‌ప్రైజ్ ఏదైనా వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.
కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. మహేష్ బాబు పుట్టినరోజుకి జక్కన్న ఎలాంటి గ్లింప్స్, టీజర్లు వదల్లేకపోతున్నాడని.. కేవలం రెండు కొత్త పోస్టర్లు మాత్రమే వదిలి సరిపెడతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు ఇదే ఘట్టమనేని ఫ్యాన్స్‌ని తెగ డిసప్పాయింట్ చేస్తోంది.
దీంతో అందరి నోళ్లలోనూ ఒకటే మాట.. అసలు జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడు అని.ఎందుకంటే గతంలో ఎంతోమంది హీరోల బర్త్‌డేలకు జక్కన్న సాలిడ్ గ్లింప్స్, అప్డేట్స్ వదిలాడు.అలాంటిది మా హీరోకి మాత్రం ఎందుకు ఇలా సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాడంటూ జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు.
మరోవైపు జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని, క్వాలిటీ కోసం తన ప్రాణం పెడుతున్నాడని..ఏ అప్డేట్ ఇచ్చినా చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలన్న నిర్ణయంతోనే ఇలా డిసిషన్ తీసుకున్నాడని సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు జక్కన్న ఫ్యాన్స్.
అయితే ఏది ఎలా ఉన్నా సినిమా నుంచి లీకులు మాత్రం ఆగడం లేదు.తాజాగా వారణాసి ఘాట్‌లో మహేష్ బాబు నీళ్లల్లో దిగుతున్న దృశ్యాలు ట్విట్టర్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.దీంతో “లీకులు ఆపలేకపోతున్నారు.. కానీ అఫీషియల్ అప్డేట్ మాత్రం వదల్లేకపోతున్నారు” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.కొందరైతే ఒక అడుగు ముందుకేసి.. “రోజూ లీకులు చూడటం కంటే ఒక 30 సెకన్ల గ్లింప్స్ ఇచ్చేస్తే హ్యాపీగా గడిపేస్తాం” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఏదేమైనా ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 9 మీదే ఉందని చెప్పాలి.మరి నిజంగానే జక్కన్న రెండు పోస్టర్లు వదిలి మమ అనిపిస్తాడా.. లేక చివరి నిమిషంలో ఏదైనా సాలిడ్ సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేస్తాడా చూడాలి.
ఇక మహేష్ బాబు నుంచి సినిమా వచ్చేది ఎలాగూ వచ్చే ఏడాది ఏప్రిల్ 7 కాబట్టి.. ఆలోపు వచ్చిన సినిమాలనే రీ రిలీజ్ చేసుకుంటామంటూ రెడీ అయిపోతున్నారు ఫ్యాన్స్.అందులో భాగంగానే మహేష్ బర్త్‌డే సందర్భంగా ‘దూకుడు’ రీ రిలీజ్‌ని థియేటర్లలో ఎంజాయ్ చేసేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు.నిజం చెప్పాలంటే.. ‘దూకుడు’ రీ రిలీజ్ కన్నా ‘వారణాసి’ నుంచి ఒక చిన్న అప్డేట్ వస్తేనే ఆడియన్స్ మరింత ఎంటర్‌టైన్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు.
🚨 MASSIVE #Varanasi LEAK! 🔥
⚔️ Mahesh Babu as Rudhra in a high-octane Ghats fight sequence! 💥🔥
The #SSRajamouli universe is gearing up for some serious MASS! 🥵#MaheshBabu #Varanasi pic.twitter.com/CV9ZtZyCv4
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) August 6, 2026
also read:మళ్లీ మొదలెట్టావా నాగవంశీ..!
చూడాలి మరి.. జక్కన్న ఈసారి పోస్టర్లతోనే సరిపెడతాడా.. లేక ఊహించని సర్‌ప్రైజ్‌తో షాక్ ఇస్తాడా!