E-Paper
Advertisement

పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి?

పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి?
Advertisement

Tollywood: తెలుగులో ‘ఎంత అందంగా ఉన్నావే’, ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ ముంబై భామ, బుల్లితెర నటి జియా శంకర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంచే ఈ అందాల భామ, తాజాగా తన ఎంగేజ్‌మెంట్ వార్తను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూ అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ కరణ్‌తో దిగిన రొమాంటిక్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు..

కరణ్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్:

చాలా కాలంగా తన ప్రేమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన జియా శంకర్(Jiya shankar), అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. లైట్ ఎల్లో కలర్ డ్రెస్‌లో జియా ఎంతో ముద్దుగా, రాయల్ లుక్‌లో కనిపిస్తుండగా, బేజ్ కలర్ అవుట్‌ఫిట్‌లో కరణ్ మెరిసిపోయారు. ఇక ప్రతిపాదన సమయంలో జియా ఎమోషనల్ అయిన క్షణాలు, కరణ్‌తో షేర్ చేసుకున్న రొమాంటిక్ కిస్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

“నువ్వు వేల మైళ్ల దూరంలో ఉన్నా..” ఎమోషనల్ నోట్:

Advertisement

ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేస్తూ జియా రాసుకొచ్చిన క్యాప్షన్ అభిమానుల హృదయాలను తాకుతోంది. “మనం ఊహించని సమయంలోనే నిజమైన ప్రేమ దొరుకుతుందనేది నిజమే కావచ్చు. కానీ దేవుడు నా ఓపికను బాగా పరీక్షించాడు. నువ్వు నాతో వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, నీతో మాట్లాడిన ప్రతి క్షణం నాకు ఎంతో హాయిగా, నా ఇంట ఉన్నట్లే అనిపించేది. లవ్ యూ కరణ్” అంటూ తన ప్రేమను చాటుకున్నారు.

రూమర్లకు చెక్ పెడుతూ షాకింగ్ సర్ ప్రైజ్:

గతంలో ‘బిగ్ బాస్ ఓటీటీ 2’లో పాల్గొన్న సమయంలో తోటి కంటెస్టెంట్ అభిషేక్ మల్హన్‌తో జియా డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కలిసి నటించడంతో ఆ రూమర్లు మరింత బలపడ్డాయి. అయితే ఆ వార్తలను ఖండించిన కొద్ది నెలల్లోనే, కరణ్‌ను పరిచయం చేస్తూ ఏకంగా ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేయడంతో ఆ రూమర్లకు పూర్తిగా చెక్ పడింది.

Advertisement

ALSO READ:తొలిసారి స్క్రీన్ పంచుకోబోతున్న తండ్రీ కొడుకు..’బరి’లోకి నాగబాబు!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు:

తెలుగు సినిమాలతో నటిగా ప్రయాణం ప్రారంభించిన జియా శంకర్, ఆ తర్వాత తమిళ్, మరాఠీ చిత్రాల్లో కూడా అలరించారు. అనంతరం బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు మరియు పాపులర్ రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నటిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు:

జియా శంకర్ ఎంగేజ్‌మెంట్ పిక్స్ బయటకు రావడంతో బుల్లితెర సెలబ్రిటీలు, వెండితెర తారలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్న ఈ జంట త్వరలోనే తమ పెళ్లి తేదీని కూడా వెల్లడించే అవకాశం ఉంది.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×