Delta Airlines Boeing: డెల్టా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన పైలట్లు అప్రమత్తమయ్యారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ట్రావెలర్లలో టెన్షన్ మొదలైంది. రోజుకు విమానాలకు సంబంధించి ఏదో ఒక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా డెల్టా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 767 విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఊహించని సమస్య ఎదురైంది.
విమానంలో గాల్లో ఉండగానే ఎడమవైపు ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి. మంటలను కిటికిలో నుంచి గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పైలట్లు ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షణాల వ్యవధిలో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్టులో సేఫ్ గా ల్యాండింగ్ అయ్యింది. అప్పటికే రన్ వేపై ఉన్న అగ్నిమాపక సిబ్బంది, విమానం ల్యాండ్ కాగానే మంటలను అదుపు తీసుకొచ్చారు. ప్రయాణికులు చూడడం ఒక్క క్షణం ఆలస్యమైనా, ప్రమాదాన్ని వర్ణించలేమని అంటున్నారు.
ALSO READ: 600 రైళ్లు 1200 లకు పెంపు, శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి
డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి విమాన ఘటనను ధ్రువీకరించారు. అయితే ఆ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టింది. విమానం ఇంజిన్‌లో మంటలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బోయింగ్ 767-400 విమానం రిజిస్ట్రేషన్ N836MH నడుస్తోంది. రెండున్నర దశాబ్దాల కిందటిది ఈ విమానం. రెండు జీఈ సీఎఫ్6 ఇంజిన్లతో నడుస్తోంది. డెల్టా విమానాల్లో మంటలు చెలరేగడం ఇది మొదటిసారి కాదు. ఏప్రిల్‌లో ఒర్లాండో ఎయిర్‌పోర్టులో డెల్టా విమానానికి నిప్పు అంటుకుంది. టేకాఫ్‌కు రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారి ఇంజన్‌లో మంటలు రేగాయి.
BREAKING 🔥
ANOTHER BOEING NIGHTMARE: DELTA FLIGHT BURSTS INTO FLAMES AFTER LAX TAKEOFF BIUND FOR ATLANTA.
Boeing 767’s engine caught fire mid-air.
Pilots turned back. Passengers watched it burn.
Emergency crews were waiting. pic.twitter.com/wAASuLFKQg— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) July 19, 2025