BigTV English

Rana Daggubati: కట్టప్ప బాహుబలిని చంపకపోతే.. రానా మైండ్ బ్లోయింగ్ ఆన్సర్?

Rana Daggubati: కట్టప్ప బాహుబలిని చంపకపోతే.. రానా మైండ్ బ్లోయింగ్ ఆన్సర్?
Advertisement

Rana Daggubati: రానా దగ్గుబాటి(Rana Daggubati) లీడర్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే హీరోగా తన నటనతో ఆకట్టుకున్న రానా అనంతరం కథ ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. అలాగే నిర్మాతగా మారి ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. ఇక రానా రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో నటించిన బాహుబలి(Bahubali) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఈయన భల్లాల దేవుడిగా నెగిటివ్ పాత్రలో నటించినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


బాహుబలి ది ఎ పిక్..

బాహుబలి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరిగి ఈ రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. “బాహుబలి ది ఎపిక్” (Bahubali The Epic)పేరిట ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.


నేనే చంపేవాడిని…

ఇలా ఈ సినిమా తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మరోసారి సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఈ సినిమాకు సంబంధించిన అంశాల గురించి ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఒక నెటిజన్ ఈ సినిమా గురించి రానాని ప్రశ్నిస్తూ.. “ఈ సినిమాలో కట్టప్ప (Kattappa)బాహుబలిని చంపకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదని” ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రానా సమాధానం చెబుతూ… “కట్టప్ప చంపకపోయి ఉంటే నేనే బాహుబలిని చంపేవాడిని”అంటూ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం రానా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?

ఇక ఈయన చెప్పిన సమాధానం పై అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ నిలిచిన సంగతి తెలిసిందే మొదటి భాగం క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని చంపడంతో పూర్తి అవుతుంది. దీంతో అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే? విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో ప్రభాస్(Prabhas) బాహుబలి పాత్రలో నటించగా కట్టప్పగా సత్యరాజ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. పదేళ్ల తర్వాత తిరిగి ఈ సినిమా రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా చూడటం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Also Read: Vishal: సినిమా రివ్యూలపై విశాల్ కామెంట్స్.. ఆ పద్ధతి మానుకోవాలంటూ!

Related News

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Akhanda 2 : ఇండస్ట్రీలో ఆ నెంబర్ సెంటిమెంట్, అనౌన్స్ చేస్తున్నారు కానీ పాటించట్లేదు

Nikhil Swayambhu : శివరాత్రికి నిఖిల్ స్వయంభు? ఆ విషయం చిత్ర ఆలోచించలేదా?

Skn : అగ్రిమెంట్ విషయంలో హీరోయిన్స్ కి ఖచ్చితంగా అది చెప్పాలి

Bandla Ganesh : నేను బ్లాక్ బస్టర్ సినిమాతో బ్రేక్ ఇచ్చా, డిజాస్టర్ సినిమాతో ఆపేయలేదు

Mari Selvaraj : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్? బైసన్ సినిమా పై సూపర్ స్టార్ రియాక్షన్

Director Maruthi : నానికి కథ చెప్తే, నాలో లోపాలు చెప్పాడు

Big Stories

×