E-Paper
Advertisement

మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ‘జై హనుమాన్’లో కీ రోల్!

మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ‘జై హనుమాన్’లో కీ రోల్!
Advertisement

Mamitha Baiju : మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో లక్కీ లేడీ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత ఏడాది కాలంగా చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది.. అంతేకాదు ఓకే నెలలో మూడు చిత్రాలతో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన హీరోయిన్గా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా దూసుకుపోతున్న ఈమె మరో గోల్డెన్ అవకాశాన్ని కొట్టేసింది. అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు జై హనుమాన్ లో ఈమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

జై హనుమాన్ సినిమాలో మమితా బైజు..

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా యంగ్ హీరో తేజ సజ్జ (Teja sajja) హీరోగా వచ్చిన హను-మాన్ బాక్సాఫీస్ వద్ద సాధించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా ఈ విజువల్ వండర్ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ పై కూడా అంచనాలు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి.. ఇక ఫిబ్రవరి నెలలో హంపి వేదికగా చాలా గ్రాండ్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా చిత్ర బృందం ప్రారంభించింది. షూటింగ్ కూడా జరుపుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫిలింనగర్ వర్గాల నుంచి వచ్చిన ఈ న్యూస్ సోషల్ మీడియాని ఊపేస్తోంది.

కథను మలుపు తిప్పే కీలకపాత్ర..

Advertisement

ప్రేమలో సినిమాతో యువతకు ఫేవరెట్ హీరోయిన్గా మారిన మమిత బైజు ఇప్పుడు వరుస హిట్టులతో సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది. అలాంటి ఈమెను ఈ మైథాలజికల్ సీక్వెల్ లో భాగం చేసినట్లు సమాచారం. కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర కోసం ప్రశాంత్ వర్మ ఈమెను సంప్రదించగా.. పాత్ర నచ్చడంతో మమిత బైజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు. దగ్గుబాటి రానా పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారనే వార్తలు ఇప్పటికే అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.

స్టార్ దిగ్గజాలతో మమిత స్క్రీన్ షేర్..

ఇలాంటి దిగ్గజాలతో మమిత బైజు లాంటి టాలెంటెడ్ పెర్ఫామర్ ను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి దించుతుండడంతో క్యాస్టింగ్ తోనే పూనకాలు తెప్పిస్తున్నారు కదయ్యా అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు . ఏది ఏమైనా మమిత బైజు ఈ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో ఆమె మరో మెట్టు పైకెక్కింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి గోల్డెన్ ఆఫర్ ఆమెను పాన్ ఇండియా స్థాయిలో మరింత ఉన్నత శిఖరాలలో నిలబెడుతుంది అనడంలో సందేహం లేదు.

Advertisement

also read: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

మమితా బైజు సినిమాలు..

మమితా బైజు ఇటీవల నటించిన సినిమాల విషయానికి వస్తే.. జననాయగన్, బెత్లెహేమ్ కుటుంబ యూనిట్, విశ్వనాథ్ అండ్ సన్స్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

Related News

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

Big Stories

Advertisement
×