E-Paper
Advertisement

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్
Advertisement

Balmoor Venkat: సిఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్మూర్ వెంకట్, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యవహార శైలిపై ఎద్దేవా చేస్తూ..‘ కేటీఆర్ కి గోకుడు తగ్గడానికి ఇచ్ గార్డ్ పంపిస్తున్న.. ప్రత్యేకంగా నువ్వు ఉండే ఇంటికి, పార్టీ ఆఫీస్ కీ పంపిస్తున్న వాడుకోండి.ఇక నుండి కేటీఆర్ గోకిన గోకకపోయినా వారం లో ఒక్కరోజు నేను నిన్ను గోకుతూనే ఉంటాను’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. డ్రగ్స్ ఆరోపణలు

Advertisement

కేటీఆర్ క్రమం తప్పకుండా డ్రగ్స్ తీసుకుంటారని బాల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఇటీవల ఒక రాజుగారి ఫామ్‌హౌస్‌లో రూ. 5 కోట్లు వెచ్చించి విదేశాల నుండి వైద్యులను రప్పించి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల వెంట్రుకల నమూనాల్లో దొరకకుండా ఉండేందుకే స్కాల్ప్ కింద ఉన్న లేయర్‌ను తొలగించి ఈ చికిత్స చేయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ సర్జరీ వల్లే ఆయన ముఖం వాసిపోయిందని, అది బయటపడకుండా ఉండేందుకు జ్వరం వచ్చిందని ట్వీట్ చేస్తూ ఇళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. కేటీఆర్‌కు ధైర్యం ఉంటే లైవ్ సెల్ఫీ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలని సవాలు విసిరారు.

డ్రగ్ టెస్ట్ సవాలు, విదేశీ పర్యటన రద్దు

Advertisement

డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నందుకే కేటీఆర్ శాంపిల్స్ ఇవ్వడానికి భయపడుతున్నారని వెంకట్ అన్నారు. తాను, ఎంపీ అనిల్ యాదవ్ ఇప్పటికే డ్రగ్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చామని గుర్తుచేశారు. శాంపిల్స్ లో దొరకకుండా ఉండటానికే కేటీఆర్ తరచూ వెంట్రుకలకు బ్లీచ్ చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఫేస్ ఇన్ఫెక్షన్ కారణంగానే కేటీఆర్ నేడు షెడ్యూల్ అయిన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు.

సోషల్ మీడియా పోస్టులు..

ఒక నటితో కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని, 2022 అక్టోబర్ 22న కుక్క ఫోటోతో పెట్టిన పోస్టులతో పాటు 2019, 2024 పోస్టులను సోషల్ మీడియా నుండి ఎందుకు డిలీట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డెక్కన్ సెరాయ్ హోటల్స్‌లో 2015లో రూ. 5 కోట్లుగా ఉన్న కేటీఆర్ షేర్ విలువ, 2025 నాటికి రూ. 175 కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని, దీనిపై డిజిపి విచారణ జరిపించాలని కోరారు.

పాస్‌పోర్ట్ వివాదం..

తాను భయపడనని చెప్పే కేటీఆర్, పాస్‌పోర్ట్ సీజ్ చేయవద్దని కోర్టును ఎందుకు ఆశ్రయించారో చెప్పాలన్నారు. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్ మధ్య తీవ్రమైన పంచాయితీ నడుస్తోందని, దాన్ని సర్దుబాటు చేయడానికి నవీన్ రావు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలోని అవినీతిని రేవంత్ రెడ్డి బయటపెడుతుంటే, తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా మహిళా నటితో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: SIR సర్వేపై BRS నోరు విప్పకపోవడానికి కారణం BJP భయమే! – మహేష్ కుమార్ గౌడ్

Tags

Related News

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 22-ఎ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

తెలంగాణ వ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది’ సంబరాలు.. కేటీఆర్ కీలక పిలుపు!

SIR సర్వేపై BRS నోరు విప్పకపోవడానికి కారణం BJP భయమే! – మహేష్ కుమార్ గౌడ్

అసలే ఎల్ నినో.. రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృదా.. పట్టించుకోని అధికారులు!

అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఈ ఘటనే ఎగ్జాంపుల్-సీపీ సజ్జనార్

సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!

Big Stories

Advertisement
×