Mamitha baiju : కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ విపరీతంగా ఫేమస్ అయింది. అయితే వాస్తవానికి ఈ రోజుల్లో ఆ డైలాగ్ కూడా కొంతమేరకు నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే ఒక సినిమాతో మంచి గుర్తింపు సాధించుకొని అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు కొంతమంది నటీనటులు. అలా ఒక సినిమా హిట్ అయిన తర్వాత పెద్ద హీరోలతో దర్శకత్వం చేసే అవకాశాలు కూడా దక్కించుకున్నారు కొంతమంది కొత్త దర్శకులు.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ప్రేమలు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఆదిత్య హాసన్ తెలుగు సంభాషణలు రాశాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా మమిత బైజుకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మమిత బైజు అంటే తెలియని వాళ్ళు లేరు.
సూర్యతో ఛాన్స్ మిస్
అయితే మమిత కు ఒకప్పుడు సూర్య సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆ సినిమా మమిత చేయలేకపోయారు. ఆ అవకాశం మళ్ళీ పోయినందుకు విపరీతంగా బాధపడిందంట. అయితే ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాలో మమిత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టిన తర్వాత మరోసారి తమిళ్ హీరో తో సినిమా చేస్తున్నాడు వెంకీ అట్లూరి. ఇదివరకే ధనుష్ (Dhanush) తో పనిచేసి సార్ (Sir) అనే సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత దుల్కర్ (dulquar Salman) తో లక్కీ భాస్కర్ (lucky Bhaskar). ఇప్పుడు సూర్య (Suriya)తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
వెంకీ రూట్ మార్చాడు
తొలిప్రేమ (Tholiprema) సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ అట్లూరి. వెంకీ దర్శకుడు కాకముందు హీరో అవుదామని అనుకున్నాడు. అయితే వెంకీ నటించిన మొదటి సినిమాకు అసలు రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని స్నేహగీతం (Sneha Geetham) అనే సినిమాలో నటుడుగా కనిపించాడు. అంతేకాకుండా రైటింగ్ సైడ్ కూడా ఆ సినిమాకి పనిచేశాడు వెంకీ అట్లూరి. మొత్తానికి విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత తొలిప్రేమ సినిమాతో దర్శకుడుగా మారాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు సరిగ్గా ఆడక పోవడంతో కంప్లీట్ గా తన రూట్ మార్చి కాన్సెప్ట్ బేస్ సినిమాలను పట్టుకున్నాడు. అక్కడితో వరుస సక్సెస్ చూస్తున్నాడు.
Also Read: Mowgli : మోగ్లీ సినిమాలో హీరోయిన్ కి మాటలు రావా? ఒక హింట్ తో దొరికిపోయారు