మరింత శత్రుదుర్భేద్యంగా మారనున్న భారత్
అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలన్నీ తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో.. భారత్ కూడా స్పేస్‌లో డామినేషన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా.. చైనా, పాకిస్థాన్, హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 మిలిటరీ శాటిలైట్లను ప్రయోగించాలని నిర్ణయించింది. రియల్ టైమ్ మానిటరింగ్‌తో పాటు ఇతర అవసరాల కోసం.. దాదాపు 27 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఓ వైపు చైనా అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో.. భారత్ ఈ చర్యలు చేపట్టింది. స్పేస్ బేస్ సర్వైలెన్స్ ఎస్‌బీఎస్ మూడో విడత ప్రోగ్రాంలో భాగంగా.. ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మిగిలిన 31 శాటిలైట్లను 3 ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసి కక్ష్యలోకి చేర్చనున్నాయి. ఇందులో భాగంగా.. తొలి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించనున్నారు. 2029 చివరి నాటికి మొత్తం 52 శాటిలైట్లను అంతరిక్షంలోకి చేర్చనున్నారు.
మిలటరీ శాటిలైట్లతో భద్రతపరంగా భారత్‌కు కలిగే మేలేంటి?
స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని.. ఇస్రో ప్రైవేటు సంస్థలకు ట్రాన్స్‌ఫర్ చేసి.. ఈ ప్రాజెక్టులో వాటికి కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది. అత్యవసర సమయాల్లో.. వేగంగా శాటిలైట్లను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది. లోఎర్త్, జియో స్టేషనరీ కక్ష్యలపై దృష్టిపెట్టే ఈ ప్రాజెక్టును.. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మానిటర్ చేయనున్నారు. చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్‌గానూ.. ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఆపరేషన్ సిందూర్‌లో.. భారత్ భారీ స్థాయిలో శాటిలైట్లను కూడా వినియోగించింది.
భారత్ చేతికి యుద్ధరంగంలోకి రియల్ టైమ్ డేటా
వాటిలో.. ఇస్రో వాడుతున్న ఉపగ్రహాలతో పాటు అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది. భారత్ దగ్గర.. 9 నుంచి 11 మిలటరీ ఉపగ్రహాలున్నాయ్. ఇస్రో.. వీటి నుంచి డేటాను సేకరించింది.. భద్రతా దళాలకు చేరవేసింది. ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి శాటిలైట్ ఇమేజ్‌లను సేకరించింది. ఇస్రో సొంతంగా వాడే కార్టోశాట్ సిరీస్‌లోని వాటిని కూడా రంగంలోకి దించింది. వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్లానింగ్ చేసి.. పాక్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి. ఈ ప్రొజెక్ట్ గనక పూర్తయితే.. భారత్ చేతికి యుద్ధరంగంలోకి రియల్ టైమ్ డేటా వేగంగా అందే అవకాశం ఉంటుంది.
పాక్, చైనా నుంచి వచ్చే ముప్పుకు ముందే చెక్ పెట్టొచ్చా?
52 శాటిలైట్ల నెట్‌వర్క్, పాకిస్థాన్, చైనా సరిహద్దులతో పాటు హిందూ మహాసముద్రంలోనూ నిరంతర నిఘాను అందిస్తుంది. ఇది.. శత్రువుల కదలికలు, సైనిక స్థావరాలు, మిసైల్ ప్రయోగాలు, కోస్ట్‌గార్డ్ కార్యకలాపాలు, ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును కూడా ముందే పసిగట్టేందుకు వీలుంటుంది. అప్పుడు.. భారత్ వెంటనే కౌంటర్ ఎటాక్స్‌కి పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. సరిహద్దుల్లో జరిగే ఏ చిన్న కదలికనైనా శాటిలైట్ల వెంటనే పసిగట్టగలవు.
సైనిక బలగాల మోహరింపును మానిటర్ చేయడంలో కీలకపాత్ర
ఇది.. చొరబాట్లను నిరోధించడంలోనూ, సరిహద్దుల వెంట సైనిక బలగాల మోహరింపును మానిటర్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. శాటిలైట్ల ద్వారా వచ్చే కచ్చితమైన నిఘా సమాచారం.. భారత సైన్యానికి శత్రు టార్గెట్లను పక్కాగా గుర్తించి, దాడి చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ శాటిలైట్ నెట్‌వర్క్ ఇండియాకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది.. పొరుగున ఉన్న శత్రుదేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లని ఎదుర్కోవడంతో పాటు భారతదేశానికి నిఘాతో పాటు భద్రతా సామర్థ్యాల్లో ఓ గేమ్ ఛేంజర్ అవుతుంది.