Manchu Vishnu:కన్నప్పతో కుదేలయిన విష్ణు ఆ తర్వాత మరో సినిమా చేయలేకపోయాడు కాని సోషల్ మీడియాలో మాత్రం వరుస అప్ డేట్స్ తో సందడి చేస్తూనే ఉన్నాడు.ఇదే క్రమంలో తాజాగా జిమ్‌లో కష్టపడి వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విష్ణు.
“Just keeping the promise I made to myself” అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు ఈ మంచబ్బాయ్. అంటే తాను తనకు తానే ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాననే అర్థం వచ్చేలా ఈ పోస్ట్ ఉందని చూస్తే అర్థమవుతుంది.
మాములుగా సెలబ్రిటీల జిమ్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తే వాటిపై ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పక్కర్లేదు.గతంలో చరణ్,తారక్ పోస్ట్ చేసిన వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో మనం చూశాం కూడా. అయితే విష్ణు షేర్ చేసిన ఈ వీడియోలో కేవలం ఫిట్‌నెస్‌ను చూపించడం కంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం ఇప్పుడు నెట్టింట్లో డిబేటబుల్ అయింది.
“నాకు నేను ఇచ్చుకున్న మాట” అంటూ విష్ణు క్యాప్షన్ ఎందుకు పెట్టాడో తెలీదు కాని,అది చూసిన నెటిజన్లు మాత్రం అదేదో సినిమా గురించి ఇచ్చుకో అన్నా ..ఒక సాలిడ్ సక్సెస్ కొడతానని నీకు నువ్వు చెప్పుకో అన్నా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.
ఇక విష్ణు విషయానికి వస్తే .. గతంలో సినిమాల కోసం లుక్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చాలా కష్టపడటం మనకి తెల్సిందే. ఇప్పుడు విష్ణు కూడా మరేదైనా సినిమా కోసం ఇలా ఫిట్‌నెస్ పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాడా లేక మరి ఇంకేదైన విషయమా అన్నది నేరుగా విష్ణు నే కన్ఫాం చేస్తే కాని తెలీదు.
ఇక మంచు విష్ణు సినిమాల విషయానికి వస్తే విషు సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూర్యం, అస్త్రం ,డీ ,కృష్ణార్జున, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడో రకం-ఆడో రకం ,అనుక్షణం ,రౌడీ అంటూ ఎన్నో సినిమాలు హిట్టు ప్లాపులకి అతీతంగా చేసుకుపోయాడు,ముఖ్యంగా అతనికి గుర్తింపు తెచ్చిన సినిమా ఏదైనా ఉందని అంటే అది డీ సినిమా అనే చెప్పాలి .
అయితే డీ కి సీక్వెల్ గా డీ అంటే డీ అదే శ్రీను వైట్ల కాంబోలో ఉంటుందని అనౌన్స్ చేశారు కాని కారణాలు ఏవైనా సినిమా మాత్రం పట్టాలెక్క లేదు.చూడాలి మరి ఈ మంచు వారి అబ్బాయి ఈసారి ఎవరితో జోడీ కడతాడో !