E-Paper
Advertisement

సినిమా రేంజ్‌లో స్కెచ్చేసిన దొంగలు.. ఆర్టీసీ బస్సులో రూ.3 కోట్ల గోల్డ్ మాయం.. కానీ చివరకి..?

సినిమా రేంజ్‌లో స్కెచ్చేసిన దొంగలు.. ఆర్టీసీ బస్సులో రూ.3 కోట్ల గోల్డ్ మాయం.. కానీ చివరకి..?
Advertisement

Gold Theft: పశ్చిమగోదావరి జిల్లాలో అందరు చూస్తుండగా నడిరోడ్డుపై బస్సులో ఏకంగా రెండున్నర కేజీల గోల్డ్ మాయం చేశారు? కానీ పోలీసులు ఊరుకుంటారా వేటాడి వెంటాడి దొరికిదంతా కక్కించారు. ఈ నెల 22న కాకినాడ నుంచి రావులపాలెం వైపు పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. అందులో మహారాష్ట్ర నుంచి వచ్చిన జితేంద్ర సింగ్ రాజ పురోహిత్ ఎక్కారు. ఆయన దగ్గర ఉన్న బ్యాగ్‌లో రెండున్నర కిలోల బంగారం ఉంది. దాని వాల్యూ ఎంతో తెలుసా అక్షరాల 3కోట్ల రూపాయలు. నరసాపురంలోని గోల్డ్ షాపుల యజమానులకు ఆ బంగారాన్ని అప్పగించడమే ఆయన డ్యూటీ. కానీ అదే బస్సులో అతని వెనకే మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని చూపు మొత్తం ఆ బ్యాగ్ మీదే ఎందుకంటే అతను మామూలు ప్రయాణికుడు కాదు. ఆ బ్యాగును కొట్టేయడానికి పక్కా ప్లాన్‌తో వచ్చిన కరుడు గట్టిన దొంగ.

అసలు డ్రామా అక్కడే..

బస్సు రామచంద్రపురం పాత బస్టాండ్‌కి చేరింది. అప్పుడే మొదలైంది అసలు డ్రామా. ఆ కేటుగాడు ఒక్కసారిగా ప్రయాణికులతో గొడవ పెట్టుకున్నాడు. అరుపులు, కేకలు అందరి చూపు అటే. ఇదే వాళ్ల అసలైన ట్రాప్. ఆ గందరగోళంలో బంగారం బ్యాగ్ కిటికీ నుంచి బయటికి ఎగిరింది. బయట కారుతో రెడీగా ఉన్న ఇద్దరు బ్యాగ్ క్యాచ్ చేసి, ఇంజిన్ స్టార్ట్ చేశారు. బస్సు దిగిన ఆ కేటుగాడు అదే కారెక్కి జంప్ అయ్యాడు. అంతా కేవలం నిమిషాల్లో జరిగిపోయింది.

Advertisement

Also Read: తొర్రూరు గురుకులంలో దారుణం.. విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్!

ఒక్క క్లూ దొరికితే..

బస్సు బ్యాంక్ సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత బాధితుడు బ్యాగ్‌ వైపు చూశాడు. బ్యాగ్ లేదు.. బంగారం లేదు. పరుగుపరుగున పీఎస్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ఇక్కడే పోలీసులు గేర్ మార్చారు. బాధితుడి నుంచి ఆ దొంగ డీటెయిల్స్ తెలుసుకున్నారు. చోరీ చేసింది సాధారణ గ్యాంగ్ కాదని అర్థమైంది. పోలీసులు టైమ్ వేస్ట్ చేయలేదు. సెల్‌ఫోన్ ట్రాకింగ్ CCTV ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఒక్కొక్క క్లూ కలిపారు నేరుగా సోలాపూర్ వరకు వెళ్లారు. అక్కడ నలుగురు దొంగలను పట్టుకొని బోను ఎక్కించారు. క్రైమ్ ఎంత స్మార్ట్‌గా ప్లాన్ చేసినా ఒక్క క్లూ దొరికితే.. గేమ్ ఓవర్.

40 కేజీల బంగారం..

Advertisement

ఇక్కడే అసలు షాకింగ్ ట్విస్ట్. ఈ నలుగురితో కథ అయిపోలేదు. వాళ్లు ఉండే ఏరియాపై పోలీసులు ఫోకస్ చేస్తే ఒక్కో ఇంటి వెనుక ఒక్కో క్రైమ్ స్టోరీ బయటపడుతుంది. ఇదేదో ఒక్కసారి చేసిన దొంగతనం కాదు. 24 కేసుల్లో 40 కేజీలు బంగారం. అంటే దగ్గర దగ్గర అర క్వింటాల్ గోల్డ్ కొట్టేశారు. కానీ పోలీసుల చేతికి చిక్కింది ఎంత? కేవలం 8 కిలోల బంగారం మాత్రమే.

Also read: తండ్రిపై కోపంతో రింగ్‌లోకి దిగిన కుర్రాడు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

Tags

Related News

ముంబైలో షాకింగ్ ఘటన.. మళ్లీ జీవం వస్తుందని క్లినిక్‌లో 80 ఏళ్ల వృద్ధుడి బాడీ భద్రం!

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. రాంరెడ్డికి సీటిచ్చింది అందుకేనా..?

బరి గీసి నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చిన హరీశ్‌.. ! రసవత్తరంగా మారనున్న పోరు.. !

జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆ పనిలో మార్పులు!

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

Big Stories

Advertisement
×