E-Paper
Advertisement

స్కూల్లో స్టూడెంట్ రౌడీ వేషాలు… టీచర్ ఇచ్చే ట్విస్టుకు పట్టపగలే చుక్కలు… కొరియన్ టీచరా మజాకా

స్కూల్లో స్టూడెంట్ రౌడీ వేషాలు… టీచర్ ఇచ్చే ట్విస్టుకు పట్టపగలే చుక్కలు… కొరియన్ టీచరా మజాకా
Advertisement

Korean Action Comedy: స్కూల్లో అందరినీ భయపెట్టే ఓ స్టూడెంట్. టీచర్లు కూడా అతని దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎదురు చెప్పే విద్యార్థులను కొట్టడం, బెదిరించడం, తన మాట వినని వాళ్లను టార్గెట్ చేయడం అతనికి అలవాటుగా మారుతుంది. కానీ కొత్తగా వచ్చిన ఓ సబ్‌స్టిట్యూట్ టీచర్ మాత్రం అతని బెదిరింపులకు భయపడదు. ఆమె గతంలోలా సాధారణ టీచర్ కాదు… బాక్సింగ్‌ లో మంచి అనుభవం ఉన్న మహిళ. మొదట సమస్యను మాటలతో పరిష్కరించాలని చూసినా, పరిస్థితి చేయి దాటిన తర్వాత ఆమె మాస్క్ వేసుకుని రంగంలోకి దిగుతుంది. ఇలాంటి కొరియన్ యాక్షన్ కామెడీ డ్రామానే ‘బ్రేవ్ సిటిజన్’ (Brave Citizen). మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అంటే…

కథలోకి వెళ్తే… 

సో సి-మిన్ ఒకప్పుడు బాక్సింగ్‌ లో ప్రతిభ చూపించిన క్రీడాకారిణి. కానీ ఇప్పుడు ఆమె జీవితాన్ని సాధారణంగా గడపాలని కోరుకుంటుంది. టీచర్‌ గా మారి ఓ హైస్కూల్‌ లో సబ్‌స్టిట్యూట్ టీచర్‌ గా పని చేస్తుంది. పాఠాలు చెప్పడం, విద్యార్థులతో సాధారణంగా ఉండడం… ఆమెకు ఇప్పుడు ఇదే జీవితం. అయితే స్కూల్లో హాన్ సూ-గాంగ్ అనే విద్యార్థి మాత్రం అందరికీ సమస్యగా మారతాడు. అతను తన తోటి విద్యార్థులను భయపెడుతూ, కొడుతూ, తన మాట వినేలా చేస్తుంటాడు. స్కూల్‌ లోని కొంతమంది సిబ్బంది కూడా అతని ప్రవర్తనను చూసి భయపడతారు.

Advertisement

సూ-గాంగ్ టార్గెట్‌ గా మారిన విద్యార్థుల్లో గో జిన్-హ్యోంగ్ కూడా ఉంటాడు. అతను తన కుటుంబ పరిస్థితుల కారణంగా సమస్యలను బయటకు చెప్పలేని స్థితిలో ఉంటాడు. సి-మిన్ ఈ వ్యవహారాన్ని గమనించినా మొదట స్కూల్ నియమాల ప్రకారం సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తుంది. కానీ సూ-గాంగ్ మరింత దారుణంగా ప్రవర్తిస్తాడు. విద్యార్థులే కాదు, టీచర్లను కూడా అవమానించే స్థాయికి వెళ్తాడు. అతని వెనుక ఉన్న కుటుంబ ప్రభావం, స్కూల్‌ లోని భయం కారణంగా ఎవరూ గట్టిగా ఎదిరించలేరు.

సి-మిన్‌ కు మాత్రం తన పాత బాక్సింగ్ సామర్థ్యం తెలుసు. అయితే తాను మళ్లీ హింసలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న ఆమె చాలా కాలం వరకు తన అసలు సామర్థ్యాన్ని దాచి పెడుతుంది. పరిస్థితి మరింత తీవ్రమైనప్పుడు మాత్రం విద్యార్థులను కాపాడటానికి మాస్క్ వేసుకుని రాత్రివేళ సూ-గాంగ్‌పై చర్య తీసుకోవడం మొదలు పెడుతుంది. ఒకవైపు టీచర్‌ గా తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. మరోవైపు విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఆపాలి. మరి తన అసలు గుర్తింపు బయట పడకుండా సూ-గాంగ్‌ ను ఆమె ఎలా ఎదుర్కొంది ? ఈ సమస్యను ఎలా పరిష్కరించింది ? అన్నదే కథ.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

షిన్ హే-సన్ (Shin Hye-sun), లీ జూన్-యంగ్ (Lee Jun-young), పార్క్ జంగ్-వూ (Park Jung-woo) నటించిన సినిమానే ‘బ్రేవ్ సిటిజన్’. దీనికి పార్క్ జిన్-ప్యో (Park Jin-pyo) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది; JioHotstarలో కూడా అందుబాటులో ఉంది. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, కొరియన్ ఆడియోలు మాత్రమే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు.

Read Also: ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

Related News

కోడి చుట్టూ తిరిగే కథ… చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించడం కష్టం… తెలుగులోనే స్ట్రీమింగ్

‘కాఫీవిత్ కరణ్’ షోకు ఎండ్ కార్డ్… కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!

తండ్రిపై కోపంతో రింగ్‌లోకి దిగిన కుర్రాడు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

నిజ జీవిత పోరాటానికి జాతీయ అవార్డు… 13 ఏళ్లుగా ఓటీటీ కోసం ఎదురుచూసిన మూవీకి మోక్షం… 8.2 రేటింగ్‌తో ఇప్పుడు స్ట్రీమింగ్

ఏకంగా 6 పెళ్ళిళ్ళు… అతన్ని పెళ్లి చేసుకున్న మహిళలంతా చనిపోతారు… ట్విస్టులతో మతిపోగొట్టే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×