Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్లలో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న సీరియల్ అంటే కార్తీకదీపం పేరు ముందుగా వినిపిస్తుంది. సాధారణ ప్రజల జీవితాలు ఎలా ఉంటాయి అన్నది ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఒక గృహిని భర్తకు దూరంగా ఉండి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది?పిల్లలను ఎలాగా పోషించుకుంటుంది?అన్న కథను సీరియల్గా తెరకెక్కించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సీరియల్కు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించిన దీప క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను కదిలించింది. తెలుగమ్మాయి కాకపోయినా కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఈమె గురించి ఈమధ్య నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట ప్రచారంలో ఉంటుంది.. తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఆ అమ్మాయి దీప కూతురా..?
కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించిన నటి అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.. ఎన్నో ఎపిసోడ్లతో సీరియల్కు శుభం కార్డు పడింది. ఈ సీరియల్ సీజన్ 2 కూడా ప్రసారమవుతుంది. మొదటి సీజన్లో ఈ సీరియల్లో వంటలక్క కూతురుగా ఒక అమ్మాయి నటించింది. ఆ పాత్రలో నటించిన అమ్మాయి పేరు బేబీ కృతిక. సీరియల్ లో తల్లిదండ్రులు కలవాలని ప్రయత్నాలు చేస్తూ తన కన్నీళ్లతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కరిగించేసింది. ఈ పాప సీరియల్స్ మాత్రమే కాదు అటు సినిమాలు కూడా చేసింది.. మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసింది. ఇక ఇప్పుడు చదువులపై ఫోకస్ పెట్టింది.. ఈ అమ్మాయి ప్రేమి విశ్వనాధ్ కూతురు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ అమ్మాయి వంటలక్క నిజమైన కూతురు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే ఇండస్ట్రీని ఊపేస్తుంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..
Also Read:హీరోలకు శాపంగా పవన్ కళ్యాణ్.. మరో హీరోకు బిగ్ షాక్..!
ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ..
ఈమె కేరళకు చెందిన నటి. ఆమె ప్రధానంగా మలయాళం మరియు తెలుగు టెలివిజన్ కార్యక్రమాలు మరియు చిత్రాలలో కనిపిస్తుంది.. ప్రేమి 1991, డిసెంబరు 2న విశ్వనాథ్, కాంచన దంపతులకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. న్యాయవాద కోర్సు చేసింది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేసిన ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతో కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ చేసింది.. కేరళలో పేరుపొందిన జోతిష్యుడైన డా. టి.ఎస్. వినీత్ భట్ తో ప్రేమి వివాహం జరిగింది. ఈమె ఇటీవల ఓ తెలుగు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి. తెలిసిందే. అందులో భాగంగా తన భర్తకి దూరంగా ఉంటాను అన్న విషయం చెప్పింది. తన కొడుకుతో ఆమె చేసిన వీల్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగు తో పాటు మలయాళం లో కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది..