E-Paper
Advertisement

తెలంగాణ ప్రభుత్వం పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. యూత్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

తెలంగాణ ప్రభుత్వం పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. యూత్ కు స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Meenaaksh Chaudhary : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి చౌదరి. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలను అందుకుంటు బిజీగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమాలో నటించింది.. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా పలు స్పెషల్ కార్యక్రమాలకి మీనాక్షి చౌదరి హాజరవుతూ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇస్తుందన్న విషయం తెలిసిందే.. ఆశగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యి తన అమూల్యమైన సలహాలను ఇచ్చింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం వీడియో వైరల్ అవ్వడంతో మీనాక్షిపై ఆమె అభిమానులు ప్రశంసల కురిపిస్తున్నారు. ఇంతకీ మీనాక్షి చౌదరి ఏం మాట్లాడిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

తెలంగాణ ప్రభుత్వంపై మీనమ్మ ప్రశంసలు..

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని మంత్రులు అలాగే సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.. చీఫ్ గెస్ట్ గా హాజరైన హీరోయిన్ మీనాక్షి చౌదరి డ్రగ్స్ నిర్మూలన గురించి తనదైన స్టైల్లో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ ప్రశంసలు కురిపించింది.. అంతేకాదు డ్రగ్స్ ని వాడడం వల్ల జరిగే పరిణామాలను గురించి కూడా వివరించి తన అమూల్యమైన మాటలతో సినీ అభిమానులను కూడా ఆకట్టుకుంది.. సమాజంలో యువత ఎలా ఉన్నారు? డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి పరిణామాలని ఎదుర్కోవాలి అన్న విషయాలతో పాటుగా తాను కూడా ఒక డాక్టరే అని బయటపెట్టింది.. మీనాక్షి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు..

Advertisement

Also Read :సాఫ్ట్ వేర్ డెవలపర్ నుంచి హీరోయిన్ గా.. ‘గోదావరి’ జాను రియల్ లైఫ్ లో ట్విస్ట్..

మీనాక్షి సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. ఈమధ్య ఈ అమ్మడు ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమా చేస్తూ వస్తుంది.. లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్ కి జోడిగా నటించి మరో భారీ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా నవీన్ పోలీశెట్టి సినిమాలో నటించింది.. ప్రస్తుతం మీనమ్మ అకౌంట్లో భారీ ప్రాజెక్టులే ఉన్నాయని తెలుస్తుంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సినిమాల గురించి అలాగే లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది..

Related News

కిమ్స్ హాస్పిటల్ లో జూ.ఎన్టీఆర్ కి శస్త్ర చికిత్స!

అగ్నివీర్ గా టాలీవుడ్ విలన్ కూతురు!

మల్టీస్టారర్ కు వెంకీ మామ సిద్ధం.. డైరెక్టర్ ప్లానింగ్ ఇదా..?

యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

Big Stories

Advertisement
×