Shakib Al Hasan On Bangladesh: బంగ్లాదేశ్ లో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన ఓ మీడియా సమావేశం నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు మొదలయ్యాయి. ఆమె ప్రెస్ మీట్ పెట్టగానే.. బంగ్లాదేశ్ యువత ఏకమై, మాజీ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) ఇంటిపై దాడికి దిగారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ లో కాకుండా శ్రీలంకలో షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. మళ్లీ బంగ్లాదేశ్ లో షకీబ్ అల్ హసన్ అడుగుపెడితే మాత్రం… దాడులు మరోసారి జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు షాకీబ్ మరో కీలక ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్ కు తన సేవలు అవసరమంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. నేను లేకపోతే బంగ్లాదేశ్ రోడ్డున పడుతుందని హెచ్చరించారు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ప్రస్తుతం తన అవసరాలు ఉన్నాయని… తాను లేకపోతే, ఆ జట్టు గెలవడం కష్టమైందని బాంబు పేల్చారు షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan). 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తన లాంటి అనుభవం ఉన్న క్రికెటర్ సేవలు బంగ్లాదేశ్ జట్టుకు అవసరమని స్పష్టం చేశారు. అనవసరంగా తనపై కక్షలు పెంచుకోకూడదని కోరారు. రాజకీయాల కారణంగా తనను దూరం చేస్తే, బంగ్లాదేశ్ క్రికెట్ దెబ్బతింటుండు అని హెచ్చరించారు షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan). బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటులో తాను ఆడాలని అనుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన అంతర్జాతీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2024 సమయంలో టెస్టులు అలాగే టి20 నుంచి తక్షణ రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ తర్వాత వన్డేల నుంచి కూడా తప్పుకుంటానని ప్రకటించారు. కానీ డిసెంబర్ 2025 సమయంలో రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మూడు ఫార్మాట్లకు ఒకేసారి రిటైర్మెంట్ ఇస్తానని కూడా వివరించారు షకీబ్ అల్ హసన్. అవసరమైతే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడి, రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన ఉన్నట్లు షకీబ్ అల్ హసన్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ తరఫున షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) ఎన్నికల బరిలో నిలిచారు. అందుకే షకీబ్ ను టార్గెట్ చేస్తున్నారు బంగ్లా పౌరులు.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు