E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రాయితో బాయ్ ఫ్రెండ్ తల పగలగొట్టే అమ్మాయి… ‘దృశ్యం’ రేంజ్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్

రాయితో బాయ్ ఫ్రెండ్ తల పగలగొట్టే అమ్మాయి… ‘దృశ్యం’ రేంజ్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller : ఉత్కంఠభరితమైన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలని ఉందా ? ఇతర జానర్లలో ఉన్న సినిమాలను చూసీ చూసీ విసిగిపోయారా ? అయితే ‘దృశ్యం’ రేంజ్ లో ఉన్న ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ ను మీ కోసం తీసుకొచ్చాము. ఈ మూవీ పేరే ‘ఎకో వ్యాలీ’ (Echo Valley). 2025లో విడుదలైన ఈ సినిమా ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+) లో అందుబాటులో ఉన్న ఒక ఉత్కంఠభరితమైన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ‘మేయర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్’ ఫేమ్ బ్రాడ్ ఇంగెల్స్‌బై రాసిన ఈ కథకు మైఖేల్ పియర్స్ దర్శకత్వం వహించారు. కూతురిపై ఉన్న అమితమైన ప్రేమతో ఒక తల్లి ఎలాంటి నేరాలు చేసింది అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.

కథలోకి వెళ్తే…

పెన్సిల్వేనియాలోని ఒక మారుమూల, ప్రశాంతమైన గుర్రాల ఫామ్‌ హౌస్‌లో కేట్ అనే మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆమె తన భాగస్వామి మరణం వల్ల మిగిలిన తీవ్రమైన గుండెకోత నుండి కోలుకోలేక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తూ గడుపుతుంటుంది. కేట్‌ కు క్లైర్ (సిడ్నీ స్వీనీ) అనే కూతురు ఉంటుంది. క్లైర్ ఒక డ్రగ్ అడిక్ట్ కావడం, ఎప్పుడూ బాధ్యతారాహిత్యంగా తిరగడం వల్ల ఆమెను కేట్ తన ఇంటి నుంచి వెల్లగొడుతుంది.

Advertisement

ఒకరోజు రాత్రి క్లైర్ ఒక్కసారిగా తీవ్రమైన భయంతో, వణుకుతూ తల్లి కంటబడుతుంది. శరీరం నిండా మనిషి రక్తపు మరకలతో కేట్ ఇంటి తలుపు తడుతుంది. తన ప్రియుడు, అలాగే డ్రగ్ డీలర్‌ తో గొడవ జరిగిందని, ఆ గొడవలో తాను అతని తలపై రాయితో కొట్టానని ఏడుస్తూ చెబుతుంది. చట్టం నుండి తన కూతురిని కాపాడుకోవడానికి, కేట్ ఆమెను ఇంట్లోనే దాచిపెడుతుంది. పోలీసులకు కూడా ఈ విషయాన్ని చెప్పదు.

క్లైర్ కొట్టిన వ్యక్తి కేవలం చిన్న డీలర్ కాదు, అతని వెనుక జాకీ అనే ఒక పెద్ద డ్రగ్ మాఫియా లీడర్ ఉంటాడు. తన మనిషి అదృశ్యం వెనుక క్లైర్ హస్తం ఉందని గ్రహించిన జాకీ, కేట్ ఉంటున్న గుర్రాల ఫామ్‌ హౌస్‌ను కనిపెట్టి అక్కడికి చేరుకుంటాడు.కేట్ తో పాటు క్లైర్‌లను కిడ్నాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు. జరిగిందేదో జరిగిపోయిందని, తన డ్రగ్ నెట్‌వర్క్‌కు పోలీసులు దొరకకుండా ఉండటానికి సహాయం చేయాలని కేట్ ను డిమాండ్ చేస్తాడు. ఒకవేళ నిరాకరిస్తే క్లైర్ చేసిన హత్యను పోలీసులకు చెప్తానని బెదిరిస్తాడు. తన కూతురి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక సాదాసీదా గుర్రాల ట్రైనర్ అయిన కేట్, ఊహించని విధంగా క్రైమ్ మైండ్‌తో ఆలోచించడం మొదలుపెడుతుంది. మరి ఆ డ్రగ్ మాఫియాను కేట్ ఎలా బురిడీ కొట్టించింది ? తన కూతురును ఎలా కాపాడుకుంది ? నిజంగానే ఆ అమ్మాయి హత్య చేసిందా ? లేదా ఎవరైనా ఆమెను ఇరికించారా ? అన్నది మూవీ. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుంది.

Advertisement

Read Also : 19 రోజుల తర్వాత తిరిగొచ్చే అన్నయ్య… కట్ చేస్తే గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్

Tags

Related News

ఆఫీస్ లైఫ్ – పర్సనల్ లైఫ్‌ను వేరు చేసే వింత ప్రయోగం… బెస్ట్ సైకలాజికల్ సై-ఫై మిస్టరీ థ్రిల్లర్

బొమ్మను నిజమైన పిల్లాడిలా చూసుకునే పేరెంట్స్… వింత నర్స్ ఎంట్రీతో మతిపోగొట్టే క్లైమాక్స్

బిలియనీర్లను టార్గెట్ చేసే మోసగాళ్ల ముఠా… మైండ్ గేమ్స్ తో బుర్రపాడు ట్విస్టులు

ఒక భార్య, ఇద్దరు భర్తలు.. చివరికి ఆమె కోసం పెద్ద డాన్‌తో పోరాటం, భలే కామెడీ మామ

‘టీచ్ యూ లెసన్’ నచ్చిందా? ఆ స్టార్లు నటించిన ఈ లీగల్ క్రైమ్ డ్రామా సీరిస్.. ఇంకా అద్భుతం

కిల్లర్లను దారుణంగా చంపేసే ముసలోడు.. అసలు ట్విస్టు తెలిస్తే మతిపోద్ది, డోన్ట్ మిస్

రీసార్ట్ లో రేవ్ పార్టీలు… అమ్మాయి మిస్సింగ్ తో అడ్డంగా బుక్కయ్యే ధనవంతులు

Big Stories

×