Small Aircraft Collides With Iconic CITIC Tower: చైనా బీజింగ్ లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. సిటీలోనే అత్యంత ఎత్తైన సిటిక్ టవర్ ను విమానం ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై భవనాన్ని ఖాళీ చేయించారు.
ప్రమాదానికి కారణమైన విమానాన్ని సన్ వార్డ్ SA 60L అరోరా అనే తేలికపాటి విమానంగా గుర్తించారు. ఇది చైనాలో తయారైన చిన్న విమానాల్లో పాపులర్ మోడల్. ఈ విమానం సిటిక్ టవర్ ను ఢీకొట్టడంతో భవనం కొంత మేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సిటిక్ టవర్ ను చైనా జున్ అని కూడా పిలుస్తారు. ఇది బీజింగ్ లోని చావోయాంగ్ జిల్లాలో ఉంది. ఈ భవనం మొత్తం 109 అంతస్తులుగా ఉంటుంది. దాదాపు 1,700 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ టవర్.. చైనాలోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చిన్న విమానం భవనాన్ని ఢీకొట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం కారణంగా భవనం కిటికీలు పగిలిపోయాయి. అలాగే విమానం శకలాలు కిందకు పడిపోతున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. భవనం కింది అంతస్తుల నుంచి పొగ ఎగసిపడినట్లు కూడా వీడియోల్లో ఉంది. ప్రమాదం తర్వాత భవనం సమీపంలో విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానం రెక్కల్లో ఒకటి భవనం పక్కనే పడిపోయినట్లు కనిపిస్తోంది. విమానం పై నుంచి పడే సమయంలో భవనానికి తగలడంతో రెండు మూడు ఫ్లోర్లు డ్యామేజ్ అయ్యాయి. భవనం పక్క భాగంలో పెద్ద రంధ్రం పడినట్లు కనిపించింది.
BREAKING: A small Sunward SA 60L Aurora plane crashed in Beijing after reportedly hitting the China Zun CITIC Tower, one of the city’s tallest buildings. pic.twitter.com/4OEU5dIXL5
— Breaking911 (@Breaking911) June 26, 2026
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. భవనంలో ఉన్న వారిని బయటకు పంపించారు. అయితే, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే విషయాలు బయటకు రాలేదు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు దాదాపు అరగంట ముందు షిఫోసి విమానాశ్రయం నుంచి బయలుదేరింది. సాయంత్రం 5.40 గంటల సమయంలో తిరిగి అదే విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, ల్యాండింగ్‌కు ముందు విమానం నిర్ణయించిన మార్గం నుంచి పక్కకు వెళ్లినట్లు తెలుస్తోంది.
సిగ్నల్ కోల్పోయిన తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. అనంతరం ఆ విమానం సిటిక్ టవర్ ను ఢీకొట్టినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రమాదానికి అసలు కారణం ఏంటి? పైలట్ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై చైనా అధికారులు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.
Read Also: ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ రెడీ.. చెన్నై స్టార్టప్ సంచలనం!