Ravi Teja:టాలీవుడ్..ఇక్కడ ఫ్యాన్ వార్ లు ,బాక్సాఫీస్ ఫైట్ లు చాలా కామన్.ముఖ్యంగా ఏ అభిమాని అయినా తమ హీరో సినిమానే సూపర్ హిట్ అవ్వాలని, తమ హీరోనే నెంబర్ వన్ గా ఉండాలని కోరుకోవడం సహజం.అలా సోషల్ మీడియాలో రోజూ గొడవలు పడే ఫ్యాన్స్ కూడా ఒక హీరో విషయానికి వచ్చే సరికి అంతా ఒక్కటైపోతారు.ఒక హిట్ వస్తే బాగుంటుందని ఆశపడుతుంటారు. ఆ హీరోనే మాస్ మాహారాజా రవితేజ.
ఇక ఈరోజే థియేటర్ లలోకి వచ్చిన ఇరుముడి విషయంలోనూ మరోసారి ఇదే రిపీట్ అవుతుంది.గత కొన్ని ఏళ్లుగా సాలిడ్ బ్లాక్ బస్టర్ చూడని రవి తేజకి ఈ సినిమా అయినా మంచి విజయం చేకూర్చాలని కోరుకున్నారంతా.ఇక దానికి తగ్గట్టుగానే అందరి అభిమానులు సినిమాని తమ భుజాలపై మోసేశారు.కట్ చేస్తే సినిమా థియేటర్ లో సాలిడ్ టాక్ ని తెచ్చేసుకుంది.ముఖ్యంగా మల్లెపూల పల్లకి అనే పాటకి థియేటర్ లలో హారతులు పడుతూ పూనకాలతో ఊగిపోతున్నారు.
ఇక “ఈ బ్లాక్ బస్టర్ TFI హీరోల ఫ్యాన్స్ అందరికీ అంకితం” అని అంటుంటే, అసలు రవితేజ సినిమా హిట్ కావాలని అందరూ ఎందుకు కోరుకుంటున్నారా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.దీనికి మెయిన్ రీజన్ రవితేజ అంటే అందరికీ ఉండే ఒక రకమైన రెస్పెక్ట్ అనే చెప్పాలి.ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ,తన సొంత కష్టంతో మాస్ మహారాజగా మారిన ఆయన లైఫ్ ప్రయాణం ప్రతీ మూవీ లవర్ కి నచ్చుతుందనడంలో సందేహం లేదు.
also read :మాధురి రాథోడ్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన ఉప్పల్ బాలు!
పైగా రవితేజ సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్లలో ఆ ఎనర్జీ, కామెడీ, డైలాగ్స్ వేరే లెవల్‌లో ఉంటాయన్న సంగతి తెల్సిందే .ముఖ్యంగా ఆయన చేసిన ‘ఇడియట్’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘క్రాక్’ సినిమాలు చూసి ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారో చెప్పక్కర్లేదు.. అందుకే ఏ హీరో అభిమాని అయినా రవితేజ నుంచి ఒక ప్రాపర్ మాస్ సినిమా వస్తే విజిల్స్ వేసి రచ్చ చేయడానికి సిద్దమైపోతాడు.
ఇక ‘ఇరుముడి’ విషయానికి వస్తే, ఇందులో కేవలం ఫైట్లు, మాస్ డైలాగ్స్ మాత్రమే కాకుండా మంచి ఎమోషన్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తుంది.అయ్యప్ప స్వామి ఇరుముడి అనే పవిత్రమైన కాన్సెప్ట్‌కు తోడు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, అదిరిపోయే యాక్షన్ అన్నింటినీ కలిపి ఈ కథను డిజైన్ చేశారట శివ నిర్వాణ . ఎప్పుడూ రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్లు చేసే రవితేజ, ఈసారి భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను నమ్ముకోవడం సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది.
గతంలో ‘ధమాకా’తో గట్టి హిట్ కొట్టిన రవితేజకు, ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. అందుకే ఈసారి ‘ఇరుముడి’తో ఆయన బాక్సాఫీస్ దగ్గర గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని అందరూ విష్ చేస్తున్నారు.
Entire Mallipoola Pallaki Sequence Ramp Ayya Ravi Anna Poonakaalu Theppinchesadu 💥💥💥💥💥
Vimal Theatre Lo 2 Times Vesadu 🥵🥵🥵🥵
Janaalu Seats Lo Padi Dorluthunnaru@gvprakash Thank You Darling
Idhi Raa Pilla Lanjodakallara Ravi Anna Cinema#Irumudi Ultra Mass Come Back pic.twitter.com/NBa6EIEY0N
— Naveen Chowdary Kosaraju (@AlwaysNachoMan2) August 21, 2026
చివరికి ఏ హీరో ఫ్యాన్స్ అయినా కోరుకునేది ఒకటే.. థియేటర్‌కి వెళ్తే మంచి సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి అని .ఇక ఈ సినిమా హిట్టయిందంటే అది ఒక్క రవితేజ గెలుపు మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా గెలిచినట్టే! అందుకే ‘ఇరుముడి’ పెద్ద హిట్ అవ్వాలని టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
also read :జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్