Sai dhurga Tej : టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గ వివాదంలో చిక్కుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రముఖ ఆలయం నీ సందర్శించారు.. అనంతరం అభిమానులతో ముచ్చటించిన ఆయన అనుకోకుండా ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేయడంతో ప్రస్తుతం ఇది వివాదానికి తెరలైపోయింది.. నెటిజెన్లు సాయి దుర్గ తేజ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. దేవుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో కూడా తెలీదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. అసలు ఈ వివాదం ఏంటి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కొలువై ఉన్న కాణిపాకం వినాయక స్వామి గుడికు మెగా హీరో సాయి దుర్గ తేజ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వినాయకుడి దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.. ఆ తర్వాత అభిమానుల మేరకు ఆలయ ప్రాంగణంలోనే సాయి దుర్గ తేజ్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా అభిమానుల కోరికమేరకు కేకును కట్ చేశారు. అదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆయన కేకు కట్ చేసిన వీడియో ఒకటి బయటకు రావడంతో నెటిజెన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో కేక్ కటింగ్ వంటి వేడుకలు నిర్వహించడంపై కొందరు భక్తులు, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. వ్యక్తిగత వేడుకలు నిర్వహించడం సముచితం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మెగా హీరో ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడని అర్థమవుతుంది. మరి దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
ఆలయానికి సంబంధించిన వసతి గృహంలో ఈ కార్యక్రమం జరగడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రజలు ఇలాంటి పనిచేస్తే కఠిన శిక్షలు ఉంటాయి మరి ప్రముఖులు లేదా సెలబ్రిటీలు ఇలాంటి పనిచేయడం పై ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ.. కొందరు హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక హీరో తో సెలబ్రేషన్స్ జరుగుతుంటే ఆలయ పాలకమండలి ఏం చేస్తుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఒక ప్రముఖ ఆలయంలో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఏం పని అంటూ మరి కొంతమంది సాయి దుర్గ తేజ్ ను అలాగే మెగాస్టార్ చిరంజీవిని టాక్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది చూడాలి. ఇక సాయి దుర్గ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ని ఎందుకు ఉంటుందో చూడాలి…
Also Read : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్..సీరియల్ అవుట్.