E-Paper
Advertisement

మ్యూజిక్ పై ఏఐ ప్రభావం.. ఆ కష్టం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ!

మ్యూజిక్ పై ఏఐ ప్రభావం.. ఆ కష్టం బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ!
Advertisement

Ajay Arasada:ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ (Ajay arasada) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన సినీ జర్నీ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయ్ , సేవ్ ద టైగర్స్ , గుర్తుకొస్తున్నాయి, వికటకవి వంటి అద్భుతమైన ప్రాజెక్ట్ లతో తెలుగు ప్రేక్షకులలో ఒక ముద్ర వేసుకున్న ఈయన వరుస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన నేపథ్యం గురించి చెబుతూ.. మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్. టీసీఎస్ లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు ఉద్యోగం చేశాను. అలా చేస్తున్న సమయంలో రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవిశ్రీప్రసాద్ స్ఫూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్ లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్ ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్ గా తీసుకున్నాడు.

దానికోసమే నిరంతరం శ్రమిస్తాను- అజయ్.

ముఖ్యంగా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని నేనెప్పుడూ కష్టపడతాను. నా దగ్గరకు అన్ని రకాల జానర్లలో కథలు రావాలని కోరుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన ప్రతి కథకు న్యాయం చేయాలని చూస్తాను. మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ ఇస్తాను. తమిళ్ నుంచి వస్తే కొత్తగా మ్యూజిక్ అందిస్తాను. మలయాళం నుంచి వస్తే ఫ్రెష్ గా ఇస్తాను అని కొంతమంది ఇక్కడ నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నమ్మాలి .

ఆ ప్రొడ్యూసర్ కి ఆ హోదా లేదు..

Advertisement

ఒక్కో సింగర్ ఒక్కో విధంగా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారో తెలుసుకొని మరి వారితోనే నేను ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్ గా అది నా పాట.. జీవితాంతం నిలిచిపోయే పాటగా ఉండాలి. కెరియర్స్ స్టార్టింగ్ లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తాను అంటే ఒక నిర్మాత వద్దని చెప్పాడు. ఇప్పుడు అదే నిర్మాత అనురాగ్ తో పాడించుకునే స్థాయిలో లేడు అంటూ తెలిపారు.

also read:రాకేష్ ఇంటి గుట్టు రట్టు చేసిన ప్రదీప్.. ఇలా తయారయ్యారేంటి భయ్యా!

ఏఐతో మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకోవడం పొరపాటు..

Advertisement

మ్యూజిక్ మీద ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. ఏఐలో ఎంత ప్రామ్టింగ్ ఇచ్చినా కూడా ఒకేలా ఉంటుంది. కొంతమంది నిర్మాతలు ఏఐ నుంచి ట్రాక్స్ పంపి ఇలా కావాలని అంటారు. అలాంటప్పుడు మేము ఎందుకు.. మీరే కొట్టుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది. ఏఐని వాడి ఏ టెక్నీషియన్ అయినా పని చేయొచ్చు. కానీ ఏఐ ని వాడి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు అని మాత్రం అనుకోకూడదు అంటూ నవ్వుతూ సరదాగా కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ పిలిచి మరీ వర్క్ ఇచ్చారు..

జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ ఇస్తాను. మొన్న మోదీ గారిని ఆయన కలిసినప్పుడు ఒక స్కోర్ చేశాను . ఆ వర్క్ చూసి ఆయన పిలిపించారు .ఆయనతో నేను పర్సనల్ గా మాట్లాడాను. పొలిటికల్గా అయినా సరే పీకే క్రియేటివి బ్యానర్ కోసమైనా సరే పని చేద్దామని ఆయన అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాతో పర్సనల్గా ఎందుకు మాట్లాడుతారు అనుకున్నా కానీ మళ్ళీ ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ఒక అయిదారు నిమిషాలు మాట్లాడి ఫోటో దిగేసి వస్తాము అనుకున్నా.. కానీ నేను వెళ్లేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అరగంట మాట్లాడారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. కలిసి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి చెప్పారు అంటూ మురిసిపోయారు.

ఈతరం డైరెక్టర్స్ లో ఆ టాలెంట్ లేదు..

ప్రజెంట్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు దర్శకులు సిట్యుయేషన్ గానీ, కాన్సెప్ట్ గానీ చెప్పి ట్యూన్ కావాలని అడిగే వారు. కానీ ఇప్పుడు వస్తున్న చాలా మందికి అది తెలియడం లేదు. సీన్స్ గురించి చెప్తారు. కానీ సీన్లో ఏం చెప్పాలని అనుకుంటున్నారో దాని కాన్సెప్ట్ ఏంటి ? ఎలాంటి పాట కావాలో చెప్పలేకపోతున్నారు.. సినిమా కాన్సెప్ట్ కూడా మాకు సరిగ్గా వివరించలేకపోతున్నారు. కాన్సెప్ట్ చెప్తే గానీ ఒక లిరిసిస్ట్ సాహిత్యాన్ని రాయలేడు.. నేను ట్యూన్ ఇవ్వలేను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

పదేళ్ల జర్నీ పై మ్యూజిక్ డైరెక్టర్ అభిప్రాయం..

పదేళ్ల జర్నీపై ఆయన మాట్లాడుతూ నా ఈ జర్నీలో నా మీద నమ్మకం ఏర్పడింది. ఎలాంటి సినిమాకైనా మ్యూజిక్ ఇవ్వగలను. పెద్ద కమర్షియల్ మూవీకి కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగలను. కానీ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ తెలిపారు.

Related News

ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.. చిత్ర బృందం క్లారిటీ!

పెళ్లికి సిద్ధమైన కావ్య – అనిరుధ్!

వివాదంలో మెగా హీరో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం..

అగధ మూవీలో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన శ్రవణ్ రెడ్డి!

అల్లు అర్జున్ కి తప్పని తిప్పలు.. వాయిదా పడ్డ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేస్?

చైల్డ్ ఆర్టిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు.. రవితేజపై మండిపడుతున్న నెటిజన్స్!

ఎఫ్డిఏ నోటీసులు..షారుఖ్ ఖాన్ తనను తాను సమర్ధించుకుంటున్నాడా?

Big Stories

Advertisement
×