E-Paper
Advertisement

ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లతో.. కొత్త మోడల్ లాంచ్

ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లతో.. కొత్త మోడల్ లాంచ్
Advertisement

Vu Glo Mini-LED TV: ప్రముఖ టెలివిజన్ బ్రాండ్ వియూ ఇండియన్ మార్కెట్లో తన లేటెస్ట్ మోడల్ ‘Vu Glo Mini-LED TV’ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. బెస్ట్ డిస్ప్లే టెక్నాలజీ,  బెస్ట్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ టీవీ టెక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సాధారణ బడ్జెట్ ధరలోనే .. హై-ఎండ్ సినిమాటిక్ ఫీల్ అందించేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, మంచి సౌండ్ సిస్టమ్ , గేమింగ్ లవర్స్‌కు నచ్చే లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త టీవీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Vu Glo Mini-LED TV ఫీచర్లు:

1.డిజైన్,డిస్‌ప్లే ప్రత్యేకతలు:

వియూ సంస్థ ఈ గ్లో మినీ-ఎల్‌ఈడీ టీవీని లేటెస్ట్ డిజైన్‌తో తీర్చిదిద్దింది. ఈ టీవీ మూడు వైపులా బెజెల్-లెస్ స్క్రీన్ డిజైన్‌ను కలిగి ఉంది. అందుకే ఇది ఇంటికి మోడర్న్ లుక్‌ను ఇస్తుంది. క్యూడీ మినీ-ఎల్‌ఈడీ టెక్నాలజీతో కూడిన ఈ డిస్‌ప్లే 600 నిట్స్ వరకు పీక్ హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ సపోర్ట్ ఉండటం రంగులు స్పష్టంగా, డీప్ బ్లాక్ లెవెల్స్‌తో కనువిందు చేస్తాయి. అలాగే ఇందులో ఉన్న పర్సనలైజ్డ్ ఫోటో ఫ్రేమ్ ఫీచర్ ద్వారా టీవీ వాడనప్పుడు.. మీ ఇష్టమైన ఫోటోలను స్క్రీన్‌పై చూడొచ్చు.

2.ప్రాసెసింగ్ , పెర్ఫార్మెన్స్:

Advertisement

స్మార్ట్ టీవీ పెర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉండేలా కంపెనీ దీనిలో లేటెస్ట్ హార్డ్‌వేర్‌ను పొందుపరిచింది. ఈ టీవీ VuON AI ప్రాసెసర్‌తో పాటు G52 హెచ్‌డీఆర్ గ్రాఫిక్స్‌పై పని చేస్తుంది. అంతే కాకుండా దీనిలో 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించడం ద్వారా యాప్స్ రన్నింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఏఐ పిక్చర్ క్వాలిటీ, అప్‌స్కేలింగ్ టెక్నాలజీ సాయంతో సాధారణ కంటెంట్‌ను కూడా హై-డెఫినిషన్ క్వాలిటీకి మల్టీ-ఫ్రేమ్ ద్వారా మెరుగు పరుస్తుంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 , హెచ్‌ఎల్‌జీ ఫార్మాట్ల సపోర్ట్ ఉండటం వలన ప్రతి సీన్ రియలిస్టిక్‌గా కనిపిస్తుంది.

3.అద్భుతమైన సౌండ్ సిస్టమ్:

కేవలం పిక్చర్ క్వాలిటీ మాత్రమే కాకుండా ఆడియో విషయంలో కూడా వియూ ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఇది. సాధారణ టీవీలలా కాకుండా ఇందులో శక్తివంతమైన 50 వాట్ల 2.2 ఛానెల్ VuFX సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. దీనిలో రెండు ఫుల్-రేంజ్ స్పీకర్లతో పాటు మరో రెండు ప్రత్యేకమైన వూఫర్లు ఉన్నాయి. దీని వల్ల అదనంగా ఎక్స్‌టర్నల్ సౌండ్‌బార్ అవసరం లేకుండానే థియేటర్‌ను తలపించే డాల్బీ ఆట్మోస్ సౌండ్ ఫీల్ కలుగుతుంది. డైలాగ్ ఎన్హాన్సర్ , సరౌండ్ మోడ్ ఫీచర్లు ఆడియో ఫీల్‌ను మరింత పెంచుతాయి.

Advertisement

Also Read: గూగుల్ మ్యాప్స్‌లో అమేజింగ్ ఫీచర్స్..99% మందికి తెలియవు !

4.గేమింగ్ ఫీచర్లు, గూగుల్ టీవీ సపోర్ట్:

గేమింగ్ లవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ టీవీలో ప్రత్యేకంగా 120Hz హై-స్పీడ్ రిఫ్రెష్ రేట్ (HSR), MEMC టెక్నాలజీని అందించారు. వేగంగా జరిగే గేమింగ్ యాక్షన్‌లో స్క్రీన్ టేరింగ్ తగ్గించడానికి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ , ఆటో లో లేటెన్సీ మోడ్ ఎంతగానో సహకరిస్తాయి. ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కాబట్టి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ , యాపిల్ ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా లభిస్తుంది.

5.ధర:

ఇండియన్ మార్కెట్లో ఈ టీవీ ధర రూ. 42,500 నుంచి మొదలవుతుంది. ఇది కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు , 65 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అయిన అమెజాన్ , వియూ అధికారిక రిటైల్ స్టోర్ల ద్వారా ఈ టీవీ కొనొచ్చు. కంపెనీ దీనిపై మూడేళ్ల వరకు వారంటీని అందిస్తుండటం విశేషం. తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ మినీ-ఎల్‌ఈడీ టెక్నాలజీ కోరుకునే వారికి ఇది ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Related News

రీల్స్ అలా చూశాడో లేదో.. ఖాతా నుంచి రూ.లక్ష స్వాహా.. ఇదో కొత్త రకం సైబర్ స్కామ్!

గూగుల్ మ్యాప్స్‌లో అమేజింగ్ ఫీచర్స్..99% మందికి తెలియవు !

అమ్మబాబోయ్.. జియో నుంచి అస్సలు ఊహించని ప్లాన్.. జస్ట్ రూ.175 కే 10 పైగా ఓటీటీలు!

మార్కెట్లో హాట్ కేకుల్లా..అమ్ముడవుతున్న బెస్ట్ గీజర్స్ ఇవే !

Airtelలో ఇంత మంచి ప్లాన్ ఉందా? ఏడాదంతా అపరిమిత 5G, కాల్స్, ఫ్రీ ఓటీటీ.. వర్త్ వర్మా వర్త్!

వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? IFB, Boschలలో ఏది బెస్ట్ ఛాయిస్?

హెల్తీ స్మూతీస్ కోసం బెస్ట్ బ్లెండర్స్..అమెజాన్‌లో ఇప్పుడు సగం ధరకే!

Big Stories

Advertisement
×