HBD Chiranjeevi : సినిమా కొందరికి అవసరం, కానీ సినిమాకే కొందరు అవసరం. మా కొందరిలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందరే. అసలు చిరంజీవి గురించి ప్రస్తావించకుండా సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడలేము. తను నడిచొచ్చిన “వే” తెలుసుకోవడానికి మనకు టైం పడుతుంది. ఆ “వే” లో కష్టం ఉంది. కన్నీరు ఉంది. కొల్లగొట్టిన రికార్డ్ ఉంది. కర్చీఫ్ వేసిన నెంబర్ వన్ స్థానం ఉంది. ఒకడు కష్టపడితే పైకి వస్తాడు అనే నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనమే చిరంజీవి.!
మెగాస్టార్ చిరంజీవి, సినిమాను 4 దశాబ్దాలుగా ఏలుతున్న పేరు ఇది. కాదు కాదు ప్రభంజనం ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T. రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. కళ్ళు కూడా మాట్లాడుతాయి అని కవులు కవిత్వం రాస్తే, ఆ కవిత్వాన్ని నిజం చేసిన కళ్ళు చిరంజీవివి. అసలు చిరంజీవి అంటే మన ఇంట్లో ఒక మనిషి. ప్రతి ఇంటికి ఒక పెద్దన్నయ్య. ఆశ్చర్యం ఏంటంటే మన నాన్నలకు కూడా ఆయనే అన్నయ్య.
టీవీలు అరుదుగా ఉన్న రోజుల్లో, అరుగు మీద కూర్చుని చూసిన సినిమాలు చిరంజీవివే, వీధిలో సినిమాలు వేస్తే తెల్లవారుజాము వరకు గొనే సంచిపై కూర్చొని చూసిన సినిమాలు కూడా చిరంజీవివే, అసలు దాదాపుగా ఇప్పటి సినిమా ప్రేక్షకుడికి సినిమాలు అంటే చిరంజీవి వే.! ప్రత్యేకంగా సినిమా పేరు చెప్తే ఎక్సైట్మెంట్ రాకపోవచ్చు, కానీ చిరంజీవి సినిమా అంటేనే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్.
ఆయన సినిమా రిలీజ్ అయితే, టికెట్ కౌంటర్ లో చొక్కాలు తడిచిపోతాయి. ఒక్క అవకాశం ఇవ్వండి ఈ టికెట్ లైన్ వదిలి బయటికి వెళ్లి బతుకుతాను అని క్యూలో నిల్చున్న వాడి కనిపిస్తుంది. అదే టిక్కెట్ దొరికితే స్వర్గానికి ఎంట్రీ దొరికినట్లే.
థియేటర్ అరుపులతో దద్దరిల్లిపోతుంది. థియేటర్ లోపల కాగితాలు శివ తాండవం చేస్తాయి. ఎందుకంటే చిరంజీవి అనేది కేవలం వ్యక్తి కాదు,అదొక అతీత శక్తీ. ఆ శక్తే , ఎంతోమందిని ఆసక్తితో సినిమా వైపు నడిపించింది. తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది, ఆ కటవుట్ కనిపిస్తూనే ఉంటుంది.
చిరంజీవి అంటే వినోదం, చిరంజీవి అంటే భావోద్వేగం. తన సినిమాలతో మన పెదవుల పై నవ్వు పూయించగలడు, కళ్ళల్లో నీళ్లు తెప్పించగలడు. తన నిజ జీవితంతో మధ్యతరగతి వాడి ఎంత దూరమైనా వెళ్ళగలడు అను నిరూపించగలడు. “నేనొక దుర్గం! నాదొక స్వర్గం! అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం” అని శ్రీశ్రీ మాటలకు నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 తో కలక్షన్స్ వర్షం కురిసి, అభిమానుల్ని ఆనందంతో తడిపింది. ఇప్పటికీ చాలామంది జీవితాల్లో సంతోషం ఉంది అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడం.
మహా ప్రస్థానం, కన్యాశుల్కం, వేమన పద్యాలు, రామారావు పౌరాణిక పాత్రలు, సుందరయ్య గారు ప్రజాసేవ…
ఇలా చెప్పుకుంటూ పోతే వీటి తో పోల్చదగినవి లేవు.!
అలానే చిరంజీవి అంటే చిరంజీవి అంటే.!
చిరంజీవిది తరతరాలు మారిన ఒక చెరగని అధ్యాయం,
ఎందుకంటే ప్రేక్షకుల నరనరాల్లో ఇంకిపోయాడు కాబట్టి.!
Happy Birthday Megastar Chiranjeevi 💙