E-Paper
Advertisement

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!
Advertisement

Meghamsh Srihari:ఎన్నో సినిమాల్లో తనదైన టాలెంట్ తో హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తెలుగు నాట మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రియల్ స్టార్ శ్రీహరి.ఇపుడు నాన్న బాటలోనే నేను అంటూ ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేసేందుకు రెడీ అయ్యాడు కొడుకు మేఘాంశ్ శ్రీహరి.

ఇక ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ లెల్లా రోహిత్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీనిని భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌పై లెల్లా రాహుల్ నిర్మిస్తున్నారు.అయితే సినిమా నుండి కథ ఏంటి, నటులు ఎవరు అన్నఅప్ డేట్స్ వదలపోయినా ఆగస్ట్ 15న శ్రీహరి బర్త్ డే సందర్భంగా ఒక సాలిడ్ ఫస్ట్ లుక్ వదిలింది మూవీ టీమ్.

శ్రీహరి సినిమాలో కనిపిస్తాడా ?

Advertisement

అయితే ఈ పోస్టర్ లో కేవలం మేఘాంశ్ శ్రీహరి ఒక్కరే కాకుండా శ్రీహరి కూడా ఉండటం విశేషం.అవును …తెలంగాణా సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉన్న పోతురాజు గెటప్ లో మేఘాంశ్ శ్రీహరి కనిపించగా, అతడి వెనకాల శ్రీహరి కూడా పోతురాజు గెటప్ లో కనిపించడం మూవీ లవర్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

మొత్తంగా తండ్రి కొడుకులని ఒకే ప్రేమ్ లో ఉండేలా డిజైన్ చేయడం రియల్ స్టార్ ఫ్యాన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది.ఇక ఈ పోస్టర్ లో మేఘాంశ్ వెనకాల శ్రీహరి ఉండటం చూస్తే ఇది కేవలం పోస్టర్ కి మాత్రమే ఈ లుక్ పరిమితం అవుతుందా లేక సినిమాలో ఏమైనా శ్రీహరి పాత్రకి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న క్యూరిసిటీ ఆడియన్స్ లో కనిపిస్తుంది.మొత్తానికి ఇందులో రియల్ స్టార్ రోల్ ఏంటి అన్నది మేకర్స్ బయటపెడితే కాని తెలిసేలా లేదు.

తెలంగాణా నేపథ్యంలో సినిమా 

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో తెలంగాణా సాంప్రదాయాలు,కళలు,జానపదాలకి , ఇక్కడి సంస్కృతికి ఈ సినిమాలో పెద్ద పీట వేయబోతున్నారని పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది.సినిమా షూటింగ్ కూడా దాదాపు 50 శాతం పూర్తి అయిందని తెలిపింది మూవీటీమ్. ఇక మిగతా షూటింగ్ పార్ట్ ని త్వరగా కంప్లీట్ చేసి త్వరలోనే ఇండియాస్ బిగ్గెస్ట్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తామనిప్రకటించారు మేకర్స్.ఇక గ్లింప్స్ లోనే సినిమా గురించి మిగతా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాతోనైనా సత్తా చాటుతాడో లేదో

ఇక శ్రీహరి విషయానికి వస్తే ‘భద్రాచలం’,‘శ్రీరాములయ్య’,‘దేవా’నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,ఢీ’,‘మగధీర’ఇలా ఎన్నోసినిమలాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న శ్రీహరి అక్టోబర్ 9 2013న మనల్ని వదిలి వెళ్ళిన సంగతి తెల్సిందే.

also read :‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్ల జాతకం మారుస్తాడా ?

చూడాలి మొదటి సినిమా రాజ్ దూత్ తో అంతగా ఆకట్టుకొని మేఘాంశ్ ఈ సినిమాతోనైనా సత్తా చాటుతాడో లేదో .

Tags

Related News

కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!

‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్ల జాతకం మారుస్తాడా ?

నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !

సైబర్ మోసగాళ్ల చేతుల్లో నాగార్జున.. డిజిటల్ అరెస్టుపై షాకింగ్ కామెంట్!

ఆరేళ్లయినా వీడని మిస్టరీ.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటున్న సోదరి!

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

Big Stories

Advertisement
×