E-Paper
Advertisement

మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mohan Babu: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటీవల నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నటించిన ది ప్యారడైజ్ (The Paradise)సినిమాలో శిఖంజా మాలిక్ అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు(Mohan Babu) ఇదివరకు ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు అయితే చాలా గ్యాప్ తర్వాత ఈయన ఈ విధమైనటువంటి నెగిటివ్ రోల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో శిఖంజా మాలిక్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

విలన్ పాత్రలో నటించడం ఇష్టం లేదా..

ఈ సినిమాకు మంచి సక్సెస్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ తో పాటు నాని మోహన్ బాబు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.ఇందులో భాగంగా మోహన్ బాబు సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నిజానికి తాను ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎందుకు ఒప్పుకున్నాను అనేది ఇప్పటికి తనకు అర్థం కాలేదని తెలిపారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా అలాగే తనకు కూడా ఈ పాత్ర చేయాలని రాసిపెట్టి ఉందేమో శ్రీకాంత్ తనను వచ్చి అడిగిన సమయం అలాంటిది అంటూ చెప్పకు వచ్చారు.

బ్రేక్ వేయడానికి బదులు ఎక్సలేటర్ తొక్కినట్టు..

Advertisement

మనం ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే బ్రేక్ వేయడానికి బదులుగా ఎక్సలేటర్ తొక్కుతుంటారు అలాగే తాను కూడా ఈ విలన్ పాత్రలో నటించడం అలాగే జరిగిందని మోహన్ బాబు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం గురించి కూడా ప్రస్తావనకు రావడంతో మోహన్ బాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి . అయితే వీటిని దాటుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

మమ్మల్ని తొక్కేయాలని చూశారు..

మనకు ఆటంకం ఎదురయిందని మనం ఆగితే మన ప్రయాణం ముందుకు సాగదు. మాకు మామూలు ఆటంకాలు కలిగించలేదు మాట్లాడుతూనే ఉంటారు తొక్కేయాలని చూస్తుంటారు. ఇలా మమ్మల్ని తొక్కేయాలని చూసిన వారే తొక్కించబడుతున్నారు అంటూ మోహన్ బాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా మోహన్ బాబు మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు అంటూ చేసిన ఈ కామెంట్స్ పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మోహన్ బాబుని తొక్కేయాలని చూసింది ఎవరు? ఇండస్ట్రీకి సంబంధించిన వారేనా? లేదా రాజకీయాల పరంగా తొక్కేయాలని చూసారా? అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో కూడా మోహన్ బాబు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీ ఎవడి అబ్బా సొత్తు కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చలకు కారణమయ్యాయి. తాజాగా తొక్కేయాలని చూశారంటూ మోహన్ బాబు మాట్లాడటం గమనార్హం.

Advertisement

Also Read: ప్రభాస్ మూవీకి టికెట్ ఇవ్వలేదని థియేటర్ కొన్న అభిమాని.. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత?

Related News

ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ మోహన్ బాబును మోసం చేశాడా?

అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలివే!

షూటింగ్లో గాయపడ్డ అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

మోహన్‌లాల్ తో నటించడంపై భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్!

‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఆ అనుమానాలు మీకొద్దు- నిర్మాత నాగవంశీ!

జైలర్ 2లో నోరా vs తమన్నా.. అసలు ఈ గ్లామర్ రచ్చ ఎందుకు?

RX 100 బ్యూటీకి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుందంటే..

Big Stories

Advertisement
×