E-Paper
Advertisement

దలాల్ స్ట్రీట్‌లో బేర్ విహారం.. గంట వ్యవధిలో రూ. 9.5 లక్షల కోట్ల ఆవిరి, ఎందుకిలా?

దలాల్ స్ట్రీట్‌లో బేర్ విహారం.. గంట వ్యవధిలో రూ. 9.5 లక్షల కోట్ల ఆవిరి, ఎందుకిలా?
Advertisement

Stock Market Crash: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెంచుతాయన్న వార్తలు, దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం నుంచి కలవరపాటుకు గురి చేసింది. ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచన, అమెరికా బాండ్ల రాబడులు ఫలితంగా ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిల నుండి బలంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో అమ్మకాల ఒత్తిడికి లోనైన గంట వ్యవధిలో సుమారు రూ. 9.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

ట్రంప్ మాటలు.. మార్కెట్‌ని నష్టాల్లోకి నెట్టేసిందా?

మధ్యాహ్నం 1.25 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్‌ 860 పాయింట్ల నష్టపోయింది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్లుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత మెల్లగా మార్కెట్ కోలుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో 10 సంవత్సరాల బాండ్ దిగుబడి కనిష్ట స్థాయిల నుండి పుంజుకుంది. ప్రస్తుతం 0.75 శాతం పైగా పెరిగింది. గురువారం ట్రేడింగ్‌లో యూఎస్ 30 సంవత్సరాల బాండ్ దిగుబడి కూడా 0.70 శాతం కంటే ఎక్కువగా పెరిగింది.

గంట వ్యవధిలో రూ. 9.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

Advertisement

నిఫ్టీ-50 స్టాక్‌ల్లో 44 కంపెనీల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.అత్యధికంగా నష్టపోయిన వాటిలో బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎం&ఎం, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీల షేర్లు ఉన్నాయి. బీఎస్ఈ -30 స్టాక్‌ల్లో 27 నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ పీవీ, ఎటర్నల్ , పవర్‌గ్రిడ్ వంటివి అత్యధికంగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 350 పాయింట్లు నష్టపోయింది.

మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు?

మార్కెట్ పతన కావడానికి మూడు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా బాండ్ల రాబడులు పుంజుకోవడం, ముడి చమురు ధరలు ఆకాశాన్నంటడం ప్రధాన కారణాలని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తామని సూచన చేశారు. ముడి చమురు ధరల్లో కొత్త ర్యాలీకి దారితీసింది. అమెరికా బాండ్ల రాబడులు కనిష్ట స్థాయిల నుండి పుంజుకున్నాయని చెబుతున్నారు.

Advertisement

ALSO READ: పెరిగిన బంగారం ధర.. మార్కెట్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయి?

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా అమ్మకాలకు పాల్పడడంతో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బుధవారం రూ. 10,148 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించారు. మంగళవారం కూడా సుమారు రూ.10 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వారంలో దాదాపు రూ.26 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి.

Related News

పెరిగిన బంగారం ధర.. మార్కెట్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయి?

‘నో యూపీఐ డే’ నిరసనపై వెనక్కి తగ్గిన ట్రేడర్స్.. మంత్రి నిర్మల భేటీలో ఏం జరిగింది?

పండగ సీజన్ వేళ సామాన్యుడికి షాక్.. గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. ఏకంగా రూ. 62.50 పెంపు

వాట్సాప్‌ మెసేజ్‌లు ఇక ఉచితం కాదు.. అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే

ఫ్లాట్ దక్కక ముందే కొనుగోలుదారుడు చనిపోతే ఎలా? హోమ్ లోన్, అతడి ఫ్లాట్ ఎవరికి దక్కుతాయి?

పాత డెబిట్ కార్డ్ పడేస్తున్నారా? ఈ పని చేయకపోతే మీ అకౌంట్ ఖాళీ!

ఎస్‌‌బీఐ బంపరాఫర్.. పిల్లలు, వృద్ధులు, యువత కోసం.. అధిక వడ్డీతో 3 సూపర్ స్కీమ్స్!

Big Stories

Advertisement
×