E-Paper
Advertisement

Vrusshabha: మోహన్ లాల్ మూవీకి ఘోర అవమానం.. మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే?

Vrusshabha: మోహన్ లాల్ మూవీకి ఘోర అవమానం.. మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే?
Advertisement

Vrusshabha:మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మోహన్ లాల్ (Mohan Lal) తాజాగా వృషభ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు షాకింగ్ కలెక్షన్లు నమోదు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూలు సాధించింది. మలయాళం లో రూ.46 లక్షలు, తెలుగులో రూ.13 లక్షలు, హిందీలో కేవలం రూ.2లక్షలు మాత్రమే రాబట్టింది. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అసలు అంచనాలనే అందుకోలేదు. ముఖ్యంగా మోహన్ లాల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. కంటెంట్ బాగోలేదని నెటిజన్లు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ రూ.70 కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఏది ఏమైనా మొదటి రోజు అత్యంత దారుణమైన కలెక్షన్లను నమోదు చేసుకొని అభిమానులను సైతం నిరాశపరిచింది.

ఆశలన్నీ అడియాశలే..

ఇదిలా ఉండగా ఇటీవల వచ్చిన తుడరుం, L2 ఎంపురాన్ , హృదయపూర్వం ఇలా వరుస చిత్రాలతో భారీ విజయాన్ని అందుకొని.. అన్ని చిత్రాలతో రూ.50 కోట్ల క్లబ్లో చేరి.. మలయాళ సినీ ఇండస్ట్రీలో 50 కోట్ల కలెక్షన్స్ తో హ్యాట్రిక్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు. అలాంటి ఈయన తాజాగా నటించిన వృషభ సినిమా కూడా అన్నే అంచనాలతో విడుదలైంది. కానీ తొలి రోజే కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూలు చేయడంతో ఆశలన్నీ అడియాశలే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మోహన్ లాల్ కి ఇది ఊహించని ఫలితం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ చూసి అటు మోహన్ లాల్ తో పాటు చిత్ర బృందం, అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

వృషభ సినిమా విశేషాలు..

Advertisement

వృషభ సినిమా విషయానికి వస్తే.. ఫాంటసీ యాక్షన్ డ్రామా చిత్రంగా విడుదలైన ఈ చిత్రానికి నందకిషోర్ రచన, దర్శకత్వం వహించారు. కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మోహన్ లాల్ లీడ్ రోల్ పోషించగా.. సమర్జిత్ లంకేష్, నయన్ సారిక, రాగిణి ద్వివేది, అజయ్, నేహా సక్సేనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023లో ప్రారంభమై 2025 ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు డిసెంబర్ 25 2025 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ వారు విడుదల చేశారు.

ALSO READ:Naveen Chandra: స్టార్ హీరో సమాధిని దర్శించుకున్న నవీన్ చంద్ర.. వీడియో వైరల్!

Related News

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

‘టాక్సిక్’లో కియారా బోల్డ్ సీన్స్.. భర్త సిద్ధార్థ్ డైవోర్స్ ?

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

Big Stories

Advertisement
×