E-Paper
Advertisement

నిమజ్జనం చేస్తూ మూసీలో పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం!

నిమజ్జనం చేస్తూ మూసీలో పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం!
Advertisement

Ganesh Immersion: స్వేచ్ఛ బ్యూరో: వినాయక నిమజ్జనం అంటేనే పాటలు, డాన్సులు, కోలాహలం. కానీ శంకర్‌పల్లిలో అర్ధరాత్రి జరిగిన ఓ ఘటన మాత్రం అక్కడున్న వారందరి గుండెలను ఒక క్షణం ఆగేలా చేసింది. గణనాథుడిని సాగనంపే క్రమంలో ఓ వ్యక్తి విగ్రహంతో పాటే నదిలోకి దూసుకెళ్లాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది?

Advertisement

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ నది పాత వంతెన వద్ద అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్ధరాత్రి వేళ కొంతమంది భక్తులు వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా వంతెన పైకి తీసుకువచ్చారు. అందరూ ఉత్సాహంగా జై గోషల మధ్య విగ్రహాన్ని చేతులతో పైకెత్తి నదిలోకి విసిరేందుకు ప్రయత్నించారు. అయితే ఆ హడావుడిలో బ్యాలెన్స్ తప్పి, విగ్రహంతో పాటు ఒక వ్యక్తి కూడా నేరుగా మూసీ నదిలో పడిపోయాడు.

కాపాడిన నది ప్రవాహం

Advertisement

ఈ హఠాత్ పరిణామంతో వంతెనపై ఉన్నవారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉత్సాహంగా సాగుతున్న ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అయితే, నదిలో రాళ్ళు రప్పలు ఉన్న చోట కాకుండా నీటి ప్రవాహం ఉన్న ప్రాంతంలో పడటంతో అతనికి పెద్దగా గాయాలు కాలేదు. అంతేకాకుండా అతనికి ఈత వచ్చి ఉండటంతో, నీటిలో పడిన వెంటనే సమయస్ఫూర్తితో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు.

బాధితుడు క్షేమంగా బయటకు రావడంతో అక్కడ ఉన్నవారంతా హమ్మయ్య అనుకున్నారు. పండుగ సంబరాల్లో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ, నదీ తీరాలు, వంతెనల వద్ద నిమజ్జనాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Also Read: ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

Tags

Related News

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క

రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!

ఖైరతాబాద్‌లో బీజేపీకి అగ్ని పరీక్ష.. కిషన్ రెడ్డి ఏం చేస్తారు?

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. సజ్జనార్ తాట తీస్తాం.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల

ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

Big Stories

Advertisement
×