Telugu Songs: ఒక్క పాట చాలు సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసికెళ్ళడానికి.మామూలు సినిమానైనా మ్యాజిక్ చేసేస్తుంది.కంటెంట్ లేని సినిమాకైనా ఎక్కడి లేని క్రేజ్ తెచ్చేస్తుంది.ఇక ఈ సోషల్ మీడియా జమానాలో అయితే పాట క్లిక్ అయితే చాలు సినిమాకి కాసుల వర్షమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పాటలకున్న పాపులారిటీ అలాంటిది మరి.కాస్త కనెక్ట్ అయితే చాలు డిస్ కనెక్ట్ అంత ఈజీగా అవ్వలేరు. ఇక ఇవే పాటలు ఎన్నో ప్లాప్ సినిమాలకి కూడా డీసెంట్ వసూల్లనే తెచ్చిపెట్టాయి.మరి ఇంతటి హిస్టరీ ఉన్న పాటల్లో ఏవి అతిగా ఆడియన్స్ ని రీచ్ అయ్యాయో , ఏ తెలుగు పాటలు బిలియన్ వ్యూస్ కి దగ్గరలో ఉన్నాయో చూసేద్దామా !
తెలుగు సినిమా పాటలతో అందరికన్నా ఆడియన్స్ ని ఎక్కువగా రీచ్ అయిన హీరోల్లో టాప్ లో ఉన్నాడు బన్నీ, అవును..త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ని సాంగ్స్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయని కొత్తగా చెప్పక్కర్లేదు.తమన్ కీ బోర్డ్ పై ప్రాణం పోసుకున్న ఈ పాటలు తెలుగు ఆడియన్స్ నే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్ ని మెస్మరైజ్ చేశాయ్. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ అనే పాట చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి నోళ్ళలో తెగ డాన్సులు వేసింది.
అర్మాన్ మాలిక్ గొంతు నుండి జాలు వారిన ఈ పాట, దానికి తోడు జానీ కంపోజిషన్ లో బన్నీ, పూజాల స్టెప్పులు పాటని మరో లెవల్ లో పెట్టేశాయ్.అలా అందరి ఆదరణని సంపాదించిన ఈ పాట యూ ట్యూబ్ లో అక్షరాల 950 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఐయాం ది కింగ్ అంటూ తెలుగు పాటలన్నింటికన్నా టాప్ ప్లేస్ లో కూర్చుంది.
ఇక రెండో స్థానంలో కూడా ఇదే సినిమాలోని ‘రాములో రాములా’ ఏకంగా 800 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టి మోస్ట్ వ్యుడ్ సాంగ్స్ లో రెండో ప్లేస్ కబ్జా చేసేసింది.పాట విషయానికి వస్తే అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన ఈ సాంగ్ ఫోక్ టచ్ తో ఉండి అన్ని ఏజెస్ వారిని తన బెస్ట్ లిజనర్స్ గా మార్చేసుకుంది.ముఖ్యంగా ఇప్పటికీ పండుగలు, పెళ్లిళ్లు అనే తేడా లేకుండా ఏ ఈవెంట్ లో చూసినా ఇదే పాట తెగ ప్లే అవుతుందంటే ఎంతగా కనెక్ట్ అయిందో అర్థం అవుతుంది.
ఇక వీటి తర్వాత అంతగా ఆకట్టుకున్న పాటల్లో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ వాటి తర్వాత స్థానాన్ని ఆక్రమించేసింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన కుర్చీ మడతపెట్టి అనే పదాన్ని యాడ్ చేసి చేసిన ఈ పాట ఇపుడు యూ ట్యూబ్ లో ఏకంగా 800 మిలియన్స్ ని దాటేయడం విశేషం.సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్నా కూడా అంతో ఇంతో కలెక్షన్స్ రాబట్టిందంటే అది ఈ పాట వల్లే అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇక ఈ పాటలో బాబు, శ్రీలీల కలిసి వేసిన స్టెప్పులు టాప్ నాచ్.
ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని తిరగరాసిన సినిమా పుష్ప. సినిమా అంతా ఒకెత్తు అయితే ఈ సినిమాలో సమంత స్టెప్పులతో అదరగొట్టిన పాట “ఊ అంటావా మావా ఊఊ అంటావా” మరో ఎత్తు.సమంత గ్లామర్ కి క్రేజీ లిరిక్స్ కలిసి ఏకంగా 500 మిలియన్లకు పైగా వ్యూస్ ని రాబట్టి చాట్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.ఇక వీటి తర్వాత నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రంలోని “వచ్చిండే” సాంగ్, అలాగే నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రంలోని “సారంగ దరియా” పాటలు కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. సాయి పల్లవి ఎనర్జిటిక్ డ్యాన్స్, తెలంగాణ జానపద సొగసులు ఈ పాటలను వందల మిలియన్ల క్లబ్‌లో చేర్చాయి.
also read:వ్యూస్ కోసం ఇంతలా దిగజారాలా?.. భాగ్యరాజ్ అంత్యక్రియల్లో మీడియాపై రాధిక ఫైర్!