E-Paper
Advertisement

కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!

కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!
Advertisement

Mamta Mohandas:మమతా మోహన్‌దాస్..ఇప్పుడున్న యూత్ కి పెద్దగా పరిచయం లేదేమో కాని ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగానే సందడి చేసింది ఈ మళయాళ ముద్దుగుమ్మ.ముఖ్యంగా యమదొంగ, కింగ్, హోమం కృష్ణార్జున,కేడీ  సినిమాలతో అప్పట్లో మంచి క్రేజ్ కొట్టేసింది.ఇక కొత్త కొత్త హీరోయిన్స్ వరుసగా దూసుకొచ్చేయడంతో సైలెంట్ గా సైడ్ అయిన ఈ అమ్మడు అప్పుడప్పుడు, రుద్రంగి, మహారాజ వంటి సినిమాలతో పలకరిస్తూనే ఉంది.

అభిమానులని అలరిస్తున్న మమతా 

ఇక ఇదిలా ఉండగా తాజాగా అమెరికాలో షికార్ చేస్తున్న మమతా అక్కడి ప్రకృతి అందచందాల నడుమ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.ఈ క్రమంలోనే కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ఉన్న బిక్స్‌బీ బ్రిడ్జ్ దగ్గర దిగిన ఫోటోలు ఇంస్టా లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి.ముఖ్యంగా అక్కడ ఉన్న సముద్రం, కొండలు, వంతెన చుట్టూ కనిపించే ప్రకృతి అందాల మధ్య స్టైలిష్ లుక్‌లో ఉన్న ఆ ఫోటోలు ఇపుడు నెటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

మాములుగా హీరోయిన్స్ ఎవరైనా అయితే షాపింగ్ మాల్స్ లోనే, లేక ఎయిర్ పోర్టుల్లోనో,లగ్జరీ హోటల్స్ లోనో లేదా టూరిస్ట్ స్పాట్ లలోనో ఫోటోలు దిగి పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.కానీ ఎంతో హిస్టరీ ఉన్నబిక్స్‌బీ బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు దిగడం ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం.

ఎంతో ప్రఖ్యాతి గాంచిన బిక్స్‌బీ క్రీక్ బ్రిడ్జ్ 

ఎందుకంటే 1932లో కాలిఫోర్నియా రాష్ట్రంలో కట్టిన ఈ బిక్స్‌బీ క్రీక్ బ్రిడ్జ్ కి ఎంతో చరిత్ర ఉంది.అక్కడి ప్రముఖ ల్యాండ్‌మార్క్స్‌లో ఒకటైన ఈ బ్రిడ్జ్  బిగ్ సర్ ప్రాంతానికి వెళ్లే వారికి బిక్స్‌బీ బ్రిడ్జ్ ఒక ఫేమస్ ఫొటో స్పాట్‌గా మారిపోయింది. ఒకవైపు నుండి చూస్తేపసిఫిక్ సముద్రం, మరోవైపు నుండి చూస్తే కొండలు, మధ్యలో ఆర్క్ ఆకారంలో కనిపించే వంతెన.. ఈ కాంబినేషన్ ఫొటోలకు పర్ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే లొకేషన్‌లో మమతా మోహన్‌దాస్ కనిపించడంతో ఆమె అభిమానులు కూడా ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.అంతే కాదు  ‘సూపర్ లుక్’, ‘బ్యూటిఫుల్ ప్లేస్’,‘ట్రావెల్ గోల్స్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు కూడా .

వ్యక్తిగత జీవితానికి వస్తే

Advertisement

ఇక మమతా మోహన్ దాస్ వ్యక్తిగత జీవితానికి వస్తే 1984 నవంబరు 14 న మోహన్‌దాస్, గంగ దంపతులకు జన్మించిన మమతా  చదువంతా బహ్రెయిన్ లోని ఇండియన్ స్కూల్ లోనే సాగింది.

బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందిన మమత  BM, కళ్యాణ కేంద్ర వంటి సంస్థలకు ప్రింట్ యాడ్స్ కోసం మోడలింగు చేయడం విశేషం.

also read :శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!

ఇక 2010 లో బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడి కోలుకున్న మమతా 2011 డిసెంబరు 28 నబహ్రెయిన్ కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్ ని పెళ్లి చేసుకుంది.అయితే ఈ బంధం కనీసం ఏడాది తిరక్కుండానే అంటే 2012 డిసెంబరు 12  నాటికే విడిపోవడం గమనార్హం.

Tags

Related News

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!

‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్ల జాతకం మారుస్తాడా ?

నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !

సైబర్ మోసగాళ్ల చేతుల్లో నాగార్జున.. డిజిటల్ అరెస్టుపై షాకింగ్ కామెంట్!

ఆరేళ్లయినా వీడని మిస్టరీ.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటున్న సోదరి!

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

Big Stories

Advertisement
×