E-Paper
Advertisement

వ్యూస్ కోసం ఇంతలా దిగజారాలా?.. భాగ్యరాజ్ అంత్యక్రియల్లో మీడియాపై రాధిక ఫైర్!

వ్యూస్ కోసం ఇంతలా దిగజారాలా?.. భాగ్యరాజ్ అంత్యక్రియల్లో మీడియాపై రాధిక ఫైర్!
Advertisement

Radhika Slams Media :”మైకులతో మొహాల మీద కొడతారా” అంటాడు ఒక సినిమాలో కోట. మీడియా చూపించే అత్యుత్సాహం అలా ఉంటుంది మరి.ఇక ప్రస్తుతం ఇది మరింత హద్దులు దాటి మనుషుల వ్యక్తిగత స్వేచ్చని హరించేలా ప్రవర్తించడం షరా మామూలు అయిపొయింది.ఇక మరికొందరు పెళ్ళైనా, చావైనా మా తీరు ఇలాగే అంటూ ఎమోషనల్ మూమెంట్స్ ని వ్యూస్ గా మార్చుకోవడంలో బిజీ అయిపోయారు.ఇదిగో అలాంటి వారిపైనే చెంప చెళ్ళుమనిపించేలా ఫైర్ అయింది సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.

 ఓవర్ యాక్షన్ చూసి మండి పడిపోయిన రాధిక 

విషయంలోకి వెళ్తే కోలీవుడ్ వెటరన్ స్టార్, స్క్రీన్ ప్లే మన్నన్ గా పేరు గాంచిన దర్శకుడు భాగ్యరాజ్ 73 ఏళ్ల వయసులో గుండెపోటుతో రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెల్సిందే. అయితే అక్కడ చనిపోయిన మనిషి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా మీడియా చూపిన అతి ఉత్సాహం ఆమెలో కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది.భాగ్య రాజ్ మృతదేహాన్ని హస్పిటల్ నుండి తెచ్చినప్పటి నుండి,అంతిమ యాత్ర పూరయ్యేవరకు మీడియా చానల్స్, యూ ట్యూబ్ చానెల్స్ చేసిన ఓవర్ యాక్షన్ చూసి మండి పడిపోయింది. చనిపోయిన ఒక వ్యక్తిని చూడటానికి వచ్చిన వారిని చుట్టుముట్టడం, వారి మొహాల మీద మైకులు పెట్టడం , చివరి మర్చిపోలేని క్షణాలని ఇలా వ్యూస్ గా మార్చి క్యాష్ చేసుకోవాలని అనుకోవడం ఏ మాత్రం బాగోలేదని ఫైర్ అయింది.

Advertisement

also read:కొద్ది గంటల్లోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్..నాగవంశీ లీక్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే!

నివాలులు అర్పించే ఆ పవిత్ర స్థలం కాస్తా వీరి చేష్టలతో ఒక సర్కస్ లా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.మన సమాజం ఇంతటి కాఠిన్యం నుంచి ఎప్పుడు మారుతుంది, తోటి మనిషి బాధను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటుంది అంటూ రాధిక వేసిన ప్రశ్నలు ఇపుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.పైగా మరో సారి ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే నటీనటులు కోరుకుంటే లాభం లేదని, గవర్నమెంట్ కూడా దీనిపై సరైన పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేసింది.చనిపోయిన ప్రముఖుల చివరి నిమిషాలలో వారికి, వాళ్ళ కుటుంబసభ్యులకి తగిన ప్రైవసీ ఇవ్వాలని గుర్తు చేసింది.

Advertisement

ఈ కామెంట్స్ ఎలాంటి సంచలనాలకి దారి తీస్తాయో 

ఇదిలా ఉంటె భాగ్య రాజా, రాధిక కాంబోలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయ్. ముఖ్యంగా 1981లో వచ్చిన ఇంద్రుపోయి నాలైవా సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ జోడీకి మంచి పేరు తెచ్చింది.ఇదే సినిమా తెలుగులో కొక్కొరోకో అంటే పేరుతో రీమేక్ అయింది. అయితే ఈ సినిమాలో భాగ్యరాజా మాత్రం నటించలేదు.

also read:ఇండియాలో సునామీ సృష్టించిన చిన్న సినిమా… .ఏ ఓటీటీ లో తెలుసా ?

ఇకపోతే నిజానికి ఈ మధ్య చాలా మంది సెలెబ్రెటీల చివరి క్షణాల్లో మీడియా ఎలాంటి అత్యుత్సాహం చూపెట్టిందో మనం చూశాం కూడా.ఇపుడు రాధిక కూడా ఇదే విషయం పై గొంతెత్తి మాట్లాడటంతో నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభిస్తుంది కూడా.ఏది ఏమైనా ఇలా ప్రముఖులు చనిపోయిన సమయాల్లో సెలెబ్రెటీలని కవర్ చేయాలన్న అత్యుత్సాహం చూపెట్టకుండా కాస్త సంయమనం పాటిస్తే మంచిది.చూడాలి రాధిక చేసిన ఈ కామెంట్స్ ఎలాంటి సంచలనాలకి దారి తీస్తాయో !

Related News

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

టాక్సిక్ మూవీపై హీరోయిన్ విమర్శలు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గాయాలతో హీరోయిన్.. ఫ్యాన్స్ ఆందోళన.. ఏం జరిగిందంటే..?

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

ఒక్క సినిమా కెరీర్ మొత్తం మార్చేసింది.. ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!

రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!

రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడం వల్లే..తేజస్విని మదివాడ వైరల్ కామెంట్స్ !

Big Stories

Advertisement
×