E-Paper
Advertisement

భర్తతో విడిపోయిన తర్వాత దారుణమైన ట్రోల్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

భర్తతో విడిపోయిన తర్వాత దారుణమైన ట్రోల్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బాలీవుడ్ బ్యూటీ!
Advertisement

Mouni Roy: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ వైవాహిక బంధం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ మరియు దారుణమైన ట్రోల్స్‌పై ఎట్టకేలకు ఆమె నోరు విప్పారు. టెలివిజన్ రంగం నుండి వెండితెర వరకు తనదైన గ్లామర్, యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్.. 2022లో ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరి మధ్య నాలుగేళ్ల సుదీర్ఘ డేటింగ్ నడిచిన తర్వాత గోవా వేదికగా అత్యంత వైభవంగా వివాహం జరిగింది. అయితే, రీసెంట్‌గా 2026 ప్రారంభంలో తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ విడాకుల ప్రకటన వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మౌనీ రాయ్‌ను టార్గెట్ చేస్తూ నెగెటివిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నెటిజన్లు, కొందరు ట్రోలర్స్ పరిధులు దాటి ఆమె క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపేలా కామెంట్స్ చేయడమే కాకుండా, ఆమెను ‘గే’ అంటూ అసత్య ప్రచారాలు, రూమర్స్ సృష్టించారు.

నవ్వేస్తూ కొట్టిపారేసిన మౌనీ రాయ్

Advertisement

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మౌనీ రాయ్ తనపై వచ్చిన విమర్శలపై చాలా ఓపెన్‌గా మరియు బోల్డ్‌గా స్పందించారు. తన విడాకుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లలో , లాజిక్ లేని ప్రచారం ఏదైనా ఉందంటే అది నన్ను ‘గే’ అనడమేనని ఆమె నవ్వేస్తూ కొట్టిపారేశారు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను బేస్ చేసుకుని ఇలాంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన మౌని, ఇలాంటి నెగెటివిటీని తాను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. విడాకులు అనేవి ఏ స్త్రీ జీవితంలోనైనా మానసికంగా ఎంతో కుంగదీసే సమయమని, అయితే అలాంటి కష్ట కాలంలో తనకు లభించిన సపోర్ట్ వల్లే తాను త్వరగా కోలుకోగలిగానని ఎమోషనల్ అయ్యారు.

Also read :‘పెద్ది’కి 366 కోట్లు వచ్చాయా? మేకర్స్ పోస్టర్ వెనుక అసలు నిజమెంత?

కుటుంబం ఉండటం తన అదృష్టం 

Advertisement

కష్ట సమయాల్లో మరియు ఒంటరితనంలో తనకు ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలిచే స్నేహితులు, కుటుంబం ఉండటం తన అదృష్టమని మౌనీ రాయ్ పేర్కొన్నారు. తన లైఫ్ లోని మంచి, చెడు.. రెండు సందర్భాల్లోనూ తన ఫ్రెండ్స్ ఎప్పుడూ తోడుగా నిలిచారని, మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి మరియు మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టడానికి వారు పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు.

మౌనీ రాయ్ ని మెచ్చుకొని తీరాల్సిందే 

వ్యక్తిగత జీవితంలో ఇన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, మౌనీ రాయ్ తన ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎక్కడా డిస్టర్బ్ చేసుకోకుండా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. 2022లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో అద్భుతమైన నెగెటివ్ రోల్‌లో మెప్పించిన ఈ బ్యూటీ, ఇటీవలే 2026లో విడుదలైన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని పెద్ద బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో పాటు లీడింగ్ ఓటీటీ సిరీస్‌లు కూడా ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ, ట్రోలర్ల నోళ్లు మూయిస్తూ మౌనీ రాయ్ ని మెచ్చుకొని తీరాల్సిందే !

Also read :ఒక్క రోజులోనే అన్ని షూటింగ్‌లా? అమితాబ్ ఎనర్జీ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Related News

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

Big Stories

Advertisement
×