E-Paper
Advertisement

రాకేష్ ఇంటి గుట్టు రట్టు చేసిన ప్రదీప్.. ఇలా తయారయ్యారేంటి భయ్యా!

రాకేష్ ఇంటి గుట్టు రట్టు చేసిన ప్రదీప్.. ఇలా తయారయ్యారేంటి భయ్యా!
Advertisement

Rocking Rakesh:ఇటీవలకాలంలో టీవీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడానికి.. పండుగలు వచ్చాయంటే చాలు ఆ పండుగల థీమ్ తో సరికొత్త షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు నెల వచ్చిందంటే చాలు ఫ్రెండ్షిప్ డే, రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం ,శ్రావణ శుక్రవారం ఇలా ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందుకే ఈ ఆగస్టు నెలలో టీవీ చానల్స్ కూడా ముందుగానే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి ఎన్నో స్పెషల్ షోలు నిర్వహిస్తూ ఉంటారు. అలా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మరో కొత్త ఎపిసోడ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఇంటి వరలక్ష్మీ థీమ్ తో వ్రతం సందర్భంగా ఏకంగా 101 మంది ఆడపడుచులతో సాగిన ఈ షో ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

మా ఇంటి వరలక్ష్మి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..

తాజాగా ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) ఇంటి గుట్టు రట్టు చేశారు ప్రదీప్(Pradeep machiraju). ఇది చూసిన నెటిజన్స్ ఇలా తయారయ్యారేంటి భయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ ను నిర్వహించగా ఈ కార్యక్రమానికి ప్రముఖ బ్యూటీ జూనియర్ శ్రీదేవి (Jr Sridevi) గెస్ట్గా వచ్చింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 101 మంది మహిళలతో వ్రతం ఆచరిస్తే ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంటారు కదా.. మీకు చెప్తే నా పని అయిపోతుంది అని ఇక్కడికి వచ్చాను” అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ తో చెబుతుంది. ఇక వెంటనే 101 మంది లేడీ సెలబ్రిటీలతో పాటు మరికొంతమంది సామాన్య మహిళలు షోలో పాల్గొన్నారు. ఈ షో కి రాకింగ్ రాకేష్ తన భార్య సుజాత (Sujatha)తో కలిసి వచ్చారు.

Advertisement

also read:పెళ్లికి సిద్ధమైన కావ్య – అనిరుధ్!

రాకింగ్ రాకేష్ కి ప్రదీప్ ఝలక్..

షో కి వచ్చిన ఒక మహిళ మా ఆయన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి ? ప్రదీప్ గారు అంటూ అడుగుతారు. “సుజాత గారు ఈవినింగ్ ఫ్రీగా ఉంటారు. ఒక గంట స్పెషల్ క్లాష్ తీసుకుంటారు. భర్తను చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ఎలా ? అని కౌంటర్ ఇస్తాడు ప్రదీప్. వెంటనే రాకింగ్ రాకేష్ షాక్ అవ్వగా.. అక్కడున్న వారంతా నవ్వేస్తారు. ఇది చూసిన నెటిజన్స్ ఏంటి భయ్యా మీరు సుజాత గారు ఎలా చెబితే అలా వింటారా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మా ఇంటి వరలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫుల్ ఎపిసోడ్ కావాలి అంటే వచ్చే ఆదివారం వరకు చూడాల్సిందే.

ఆకట్టుకున్న ప్రోమో..

Advertisement

ఈ ప్రోమోలో ఎంతోమంది చిన్నారులు తమ అద్భుతమైన నృత్యాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. సెలబ్రిటీలు కూడా మా ఇంటి వరలక్ష్మి స్పెషల్ షోలో సందడి చేశారు. మొత్తానికైతే ఈ షో టిఆర్పి రేటింగ్ పెంచడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

Big Stories

Advertisement
×