E-Paper
Advertisement

డ్యాన్స్ ఫ్లోర్ నుంచి విలన్ రోల్ వరకు.. రాఘవ్ జుయాల్ జర్నీ ఇదే!

డ్యాన్స్ ఫ్లోర్ నుంచి విలన్ రోల్ వరకు.. రాఘవ్ జుయాల్ జర్నీ ఇదే!
Advertisement

Raghav Juyal Journey:మాములుగా ఈవెంట్ లలో ఎవరు హైలెట్ అవుతారు..అయితే హీరో లేకుంటే హీరోయిన్ ,కానీ సినిమాలో నటించే విలన్ హైలెట్ గా నిలుస్తాడని ఎవరైనా ఊహిస్తారా.కానీ అదే మ్యాజిక్ జరిగింది.

నిన్న జరిగిన ది ప్యారడైజ్ ఈవెంట్ లో హీరో ,హీరోయిన్ లకన్నా ఎక్కువ మీడియాలో హైలెట్ అయింది ఎవరైనా ఉన్నారంటే అది ప్యారడైజ్ విలన్ రాఘవ్ జుయాలే ..ఆడిటోరియం లోకి అడుగుపెట్టినప్పటి నుండి అందరి ఫోకస్ ని తనవైపు తిప్పేసుకున్న ఈ క్రేజీ యాక్టర్ ఈవెంట్ మొత్తం మీద హైలెట్ గా నిలిచాడు.

Advertisement

ముఖ్యంగా తనని స్టేజ్ మీదికి పిలిచినప్పుడురాఘవ్ జుయాల్‌ చేసిన హడావిడి, వేసిన డాన్స్ స్టెప్పులు ఆడిటోరియాన్ని ఉర్రూతలూగించాయి.ప్యారడైజ్ లోని ఆయా షేర్ పాటకి తనవైన స్టెప్పులు వేస్తూ సందడి చేసిన రాఘవ్ జుయాల్‌ సుమ చీర పట్టుకుని సరదాగా వేసిన స్టెప్పులు అక్కడికి వచ్చిన ప్రేక్షకుల్లో నవ్వులు పూయించాయి.

ఇక రాఘవ్ జుయాల్‌ తొలిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అసలు రాఘవ్ జుయాల్‌ సినీ జర్నీ ఎంటా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.మరి రాఘవ్ జుయాల్‌ ఎక్కడి నుండి ఎలా వచ్చాడో ఒకసారి చూసేద్దాం .

Advertisement

1991 జూలై 10న పుట్టిన రాఘవ్

రాఘవ్ జుయాల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 1991 జూలై 10న పుట్టాడు.ఇక అందరిలాగే చిన్నప్పటి నుండి సినిమాలు, డాన్స్ లు అంటే ఎంతో ఆసక్తి చూపించేవాడు జుయాల్. అయితే డాన్స్ అంటే ఇష్టమైనప్పటికీ ఎక్కడా ప్రొఫెషనల్ డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకోలేదు.

అయినప్పటికీ టీవీ, ఇంటర్నెట్‌లో డ్యాన్స్ వీడియోలు చూస్తూ తనకంటూ ఒక స్పెషల్ స్టైల్ ని సెట్ చేసుకున్నాడు.బీట్ కి తగ్గట్టుగా బాడీని స్లో మోషన్ లో కదిలించడంలో మాంచి పట్టు సంపాదించిన జుయాల్ క్రమంగా “కింగ్ ఆఫ్ స్లో మోషన్” అనే పేరుని సంపాదించుకున్నాడు.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్కూల్ రోజుల్లో డ్యాన్స్లు ఎన్ని చేసినా ఎప్పుడు అవార్డు రాలేదట,అలా ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’లో సెలెక్ట్ అయ్యేవరకు కూడా జుయాల్ కి ఎప్పుడు మొదటి బహుమతి కూడా రాలేదని ఒక ఇంటర్వ్యూలో వాపోయాడు జుయాల్.

తొలిసారి 2012లో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’లో

ఇక ముంబైలో ఆడిషన్ లో పాల్గొనేందుకు ఏకంగా బోర్డు పరీక్షలను వదిలేశాడంటే డాన్స్ పై జుయాల్ కి ఎంత క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. అలా తొలిసారి 2012లో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’లో కనిపించాడు జుయాల్.అయితే అతడి డ్యాన్స్ ఇతర కంటెస్టెంట్లకు కాస్త తేడా ఉండటంతో అతడి డాన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ పెరిగింది .

అది ఎంతలా అంటే మొదట్లో టాప్ కంటెస్టెంట్లలో చోటు దక్కకపోయినా, ప్రేక్షకుల డిమాండ్‌తో అతడిని వైల్డ్‌కార్డ్ ద్వారా తిరిగి షోలోకి తీసుకొచ్చేంతగా .అలా క్రమంగా డ్యాన్స్ రియాలిటీ షోల్లో స్కిప్పర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, హోస్ట్‌గా కూడా తన కెరీర్ ని ఇక్కడే రాఘవ్‌కు ఒక ఇమేజ్ ఏర్పడింది.

2021లో టీవీ నుండి సినిమా వైపు

అయితే టీవీలో రాఘవ్‌కు హోస్ట్ చేయగలడు. కామెడీ చేయగలడు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగలడు అని మంచి పేరు వచ్చింది కాని అది అతడికి అంత కికివ్వలేదు. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.అలా 2021లో టీవీ నుండి సినిమా వైపు మూవ్ అయిపోయాడు.

అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాఘవ్ అంత ఈజీగా మంచి పాత్రలని దక్కించుకోలేకపోయాడు. ABCD 2, స్ట్రీట్ డాన్సర్ 3D,కిసికా బాయ్ కిసికా జాన్ వంటి సినిమాల్లో చిన్న చితకా పాత్రలని మాత్రమే దక్కించుకోగలిగాడు.

విలనిజం అంటే ఇలా కూడా

అయితే 2024లో మాత్రం అతడి అదృష్టం ఒక్కసారిగా టర్న్ అయిపొయింది. ఆ ఏడు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన కిల్ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో రాఘవ్ ‘ఫణి’ అనే డకాయిట్ పాత్ర పోషించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. విలనిజం అంటే ఇలా కూడా చేయవచ్చా అంటూ సరికొత్త ట్రెండ్ కి నాంది పలికాడు జుయాల్.

అలా కిల్ సినిమాతో టాక్ ఆఫ్ ది బీ టౌన్ అయిన ఈ క్రేజీ యాక్టర్ తర్వాత గ్యారా ,గ్యారా సినిమాలో సెన్సిటివ్ పోలీస్ ఆఫీసర్ గా యుద్రాలో మరో యాక్షన్ షేడ్ చూపించి మేపించాడు .అయితే  ది బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్ లో చేసిన సరికొత్త రోల్ మాత్రం ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

also read :రూ.43 కోట్ల చెక్కుల వివాదం.. రాధాపై అంబికా షాకింగ్ కామెంట్స్!

ఇక బాలీవుడ్ లో సత్తా చాటిన విక్రం మాలిక్ గా ది ప్యారడైజ్ సినిమాలో మరోసారి విలనిజం చూపేందుకు రెడీ అయిపోయాడు.చూడాలి మరి తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో ఎలా పాగా వేస్తాడో !

Tags

Related News

‘ది ప్యారడైజ్’ లో మోహన్ బాబు పాత్ర అంత భయంకరంగా ఉంటుందా?

రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు!

నిహారికకు నేషనల్ అవార్డు.. నాగబాబు పోస్ట్ వైరల్.. వారసత్వం బంగారం అంటూ!

పుష్ప మంగళం శీను క్యారెక్టర్ మిస్ చేసుకున్న నటుడు.. రాసి పెట్టలేదంటూ!

రూ.43 కోట్ల చెక్కుల వివాదం.. రాధాపై అంబికా షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి మాతృవియోగం!

తాతయ్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన ఉపాసన.. వెల్లువిరిసిన ఆధ్యాత్మికత!

Big Stories

Advertisement
×