E-Paper
Advertisement

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?
Advertisement

Nagachaitanya Vs Nithin: సినిమా ఇండస్ట్రీలో ఒకేరోజు పలువురు స్టార్ట్ హీరోల సినిమాలు విడుదల అవడం సర్వసాధారణం . ఇలా ఒకే రోజు రెండు సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే రాబోయే నవంబర్ డిసెంబర్ నెలలో కూడా ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలు భారీ స్థాయిలో పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో టైర్ 2 హీరోల సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య వృషకర్మ..

ఇప్పటికే డిసెంబర్ నెలలో కొన్ని సినిమాలు అధికారం విడుదల తేదీని ప్రకటించినప్పటికీ మరికొన్ని సినిమాలు కూడా అదే తారీకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. డిసెంబర్ 4వ తేదీ ఇప్పటికే అక్కినేని హీరో నాగచైతన్య(Nagachaitanya) నటించిన వృషకర్మ (Vrusha Karma)సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే నాగచైతన్య సినిమాకు పోటీగా మరొక సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

అలియాస్ రుక్మిణిగా రాబోతున్న నితిన్..

Advertisement

నటుడు నితిన్(Nithin) నటిస్తున్న అలియాస్ రుక్మిణి (Alias Rukmini)సినిమా కూడా డిసెంబర్ 4వ తేదీ విడుదల కాబోతున్నట్లు నేడు చిత్ర నిర్మాతలు అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. నాచురల్ స్టార్ నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మాతగా మురళి కాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సరికొత్త రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్య సినిమాకు పోటీగా నితిన్ అలియాస్ రుక్మిణి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

వెనకడుగు వేయబోతున్నారా..

మరి ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరరు గెలుస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాల విడుదలకు ఇంకా టైం ఉన్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతాయా? లేదంటే ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వృషకర్మ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈసారి నాగచైతన్య పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కొట్టబోతున్నారని తెలుస్తుంది. మరి నితిన్ సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరిది పై చేయి అవుతుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

Related News

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన విజయ్ దేవరకొండ… వాటిని తొలగించాలంటూ!

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ‘జై హనుమాన్’లో కీ రోల్!

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

Big Stories

Advertisement
×